పూరి జగన్నాథ్ కూతురు కోసం వైఎస్ జగన్...
ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ కు పలువురు సినీ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హాజరై సందడి చేశారు. సినీ ప్రముఖుల సంగతి పక్కన పెడితే....రాజకీయాల్లో బిజీగా ఉండే వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో టాలీవుడ్ హీరోస్ గోపీచంద్, రవితేజ, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, శ్రీహరి, అల్లు అర్జున్, హీరోయిన్లు ప్రియమణి, ఛార్మి, తమన్నా, సమంత, దర్శకులు రాజమౌళి, శ్రీనువైట్ల, ఆర్. నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ది బిజినెస్ మ్యాన్ సినిమా రూపొందిస్తున్నారు. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు ఈ వేడుకకు రాలేదని సమాచారం. పూరీ స్థానంలో సహాయ దర్శకులు సినిమా సంబంధించిన ఇతర కార్యక్రమాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











