పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చిత్రం
సింహా విజయం బాలయ్యకు మంచి కిక్ ఇస్తోంది. పోకిరి వంటి చరిత్ర తిరగరాసిన చిత్రం తీసిన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ బుక్కయ్యారు. ఇంతకుముందు బాలకృష్ణ హీరోగా 'చెన్నకేశవ రెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తిరిగి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మీడియాకుతో మాట్లాడుతూ 'బాలయ్యబాబు, పూరి జగన్నాథ్ ల ఫస్ట్ కాంబినేషన్ లో ఓ అద్భుతమైన చిత్రాన్ని మా బేనరులో నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. బాలయ్యబాబు కెరీర్‌లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. పూరి జగన్నాథ్, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి ధీటుగా ఈ చిత్రం సబ్జెక్ట్ ఉంటుంది. 'చెన్నకేశవ రెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాల తర్వాత బాలయ్యబాబుతో మా బేనరులో నిర్మిస్తున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. త్వరలో ప్రారంభమయ్యే ఈ ప్రిస్టేజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు అతి త్వరలో తెలియచేస్తాం' అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ ప్రి రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.


Click it and Unblock the Notifications











