twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో హిందీ చిత్రం కమిటైన పూరిజగన్నాథ్‌

    By Srikanya
    |

    ముంబై: స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్‌, ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఎన్‌.ఆర్‌.పచిసియా నిర్మించనున్న ఒక హిందీచిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నటీనటులు ఇంకా ఖరారు చేయలేదు. పూరి దర్శకత్వం వహించిన తెలుగు సినిమాను హిందీలో రీమేక్‌ చేయవచ్చని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం పచిసియా ఏడేళ్లనాటి మళయాళ చిత్రం 'రాజామాణిక్యం'ను రీమేక్‌ చేస్తున్నారు. గతంలో పూరిజగన్నాథ్‌, అమితాబ్‌ బచన్‌ నటించిన 'బుడ్ఢా హోగా తేరాబాప్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

    కెమెరామెన్ గంగతో మంచి ఊపు మీద ఉన్న పూరీ జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ తో తదుపరి చిత్రం హడావిడిలో ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .

    ఇదిలా ఉంటే అభిమానులను అలరించటానికి 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌'ల తరవాత మహేష్‌ బాబు, పూరి జగన్నాథ్‌ కలయికలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూరి కథాంశాన్ని మహేష్‌కి వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగాయని సమాచారం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌బాబు నిర్మిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    2013 వేసవి లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రేసీ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ హిట్టవగానే వెంటనే పూరీ జగన్నాధ్ తను మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం చేస్తున్నానని ప్రకటించారు. అంతేగాక తాను ఓ లైన్ కూడా రెడీ చేసానని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేస్తాను అన్నారు. అయితే ఆయన వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ఆ విషయమే ఎత్తటం లేదు. దాంతో రకరకాల అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫద్యంలో ఆయన మీడియాతో ఈ విషయమై క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ మ్యాన్ 2 సినిమా ఇక లేనట్టే. ఆ స్థానంలో మహేష్‌ కోసం కొత్త కథ రాస్తా అన్నారు. కాబట్టి ఈ చిత్రం ఓ కొత్త కథ అని తెలుస్తోంది.

    English summary
    Puri Jagannath, who made his Bollywood debut with Big B starrer Bbuddah Hoga Terra Baap, has been signed by veteran producer N.R.Pachisia to direct a film for his banner. While the casting is yet to be finalized, the film will be a remake of one of Puri's popular Telugu films. Pachisia meanwhile is also producing the remake of the 2005 Malayalam film Rajamanikyam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X