పూరి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా విశేషాలు
అక్కినేని వారసుడు నాగచైతన్య, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌ల్లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. ఆటోనగర్ సూర్య షూటింగ్ తర్వాత మరో సినిమా కమిటైన నాగచైతన్య పూరితో చేయబోయే సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి.. నాగ చైతన్యకు కథ వినిపించాడని, ఆ కథ విన్న వెంటనే నాగచైతన్య ఓకే చెప్పాశాడని సమాచారం. ఈ సినిమాను ఆర్ఆర్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్-ఆర్ఆర్ మూవీ మేకర్ కాంబినేషన్లో మహేష్ బాబుతో 'బిజినెస్ మ్యాన్" చిత్రం రూపొందుతోంది. నాగచైతన్యతో సినిమా మార్చి 25, 2012లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం నాగ చైతన్య తన తాజా సినిమా 'బెజవాడ" విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మరో వైపు దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య"సినిమాలో బిజీగా గడుపుతున్నాడు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న 'గౌరవం" అనే చిత్రంలో కూడా లీడ్ రోల్ చేస్తున్నాడు చైతు. ఇప్పటి వరకు తన తోటి యువ హీరోలకంటే కాస్త వెనకే ఉన్న నాగ చైతన్య... మరి పూరి డైరెక్షన్ అగ్రస్థానానికి చేరుకుంటాడో? లేదో? వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











