సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పూరి జగన్నాథ్
ఈ కాంబినేషన్ వినటానికి ఆశ్చర్యంగా ఉంది కానీ...1997లో అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభ వేడుక జరిగింది. అప్పట్లో పూరీ జగన్నాధ్ ఇంకా బద్రి చిత్రం చేయలేదు. అవకాశాలు కోసం ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్లు ఉంది పరిస్ధితి. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణను కలిసి ఓ ముదిరిపోయిన బ్రహ్మచారి వివాహానికి సంభందించిన కథ వినిపిస్తే, ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ చిత్రం టైటిల్ 'థిల్లానా'. కథ ప్రకారం కృష్ణ ఓ బ్రాహ్మణ అగ్రహారానికి చెందిన యువకుడు తన అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి తేరుకునేసరికి వయుసు ముదిరిపోతుంది. దాంతో ఒంటరిగా జీవితాన్ని వెళ్ళబోస్తూంటాడు. అందుకే అక్కాచెల్లెళ్లు, బావలు కలిసి అతని పెళ్లి కోసం చేసే ప్రయత్నాలే ఈ కథ. ఐ.బి.కె.మోహన్ ఈ చిత్రానికి నిర్మాత. ముగ్గురు చెల్లెళ్ల పాత్రలకు ఝాన్సీ (యాంకర్), హేమ, మల్లిక (యాంకర్)ను తీసుకున్నారు. కృష్ణ సరసన ఓ కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారు. శ్యామ్ కె.నాయుడు కెమెరామేన్. అయితే ఒకే ఒక్క రోజు షూటింగ్ జరిగాక, ఆర్థిక కారణాల రీత్యా సినిమా ఆగిపోయింది. ఈ కధనాన్ని ఓ లీడింగ్ తెలుగు పేపరు వాళ్ళు ప్రచురించారు. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో పూరీ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆర్టికల్ రాసిన జర్నలిస్టు పులగం చిన్నారయణని సైతం మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











