దర్శకుడు పూరీ జగన్నాధ్ కి పితృ వియోగం
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తండ్రి పేట్ల సింహాచలం (69) ఈ రోజు(జూలై 5) ఉదయం 11:50 నిముషాలకు మరణించారు. వైజాగ్ అపోలో హాస్పటిల్ లో చేరిన కాస్సేపటికే మరణం సంభవించింది. ఆయన కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్నారు. పూరీ జగన్నధ్ ఆయనకు పెద్ద కుమారుడు. పూరీ తర్వాత గణేష్, సాయి మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. పూరీ దర్శకుడుగా సెటిల్ కాగా, సాయి రామ్ శంకర్ హీరోగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఇక గణేష్..బంపర్ ఆఫర్ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా మారారు. ఇక పూరి తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని బ్యాంకాక్ నుంచి కొద్ది రోజుల క్రిందట హడావిడిగా వచ్చారు. తన తండ్రి చివర క్షణాల్లో ఆయన దగ్గర ఉన్నారు. ఇక పూరీ తండ్రి మృత దేహాన్ని నర్సీపట్టణం దగ్గరలో ఉన్న సొంత ఊరు తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూరీ జగన్నాధ్ కి అతని కుటుంబసభ్యులకు ధట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











