లాస్ ఏంజిల్స్ ఆర్చీవ్స్ లో పూరి జగన్నాథ్ స్ర్కిప్ట్..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కధకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పూరీ జగన్నాథ్ స్ర్కిప్ట్ 'బుడ్డా..హోగా తేరా బాప్" ను ప్రపంచ ప్రఖ్యాతి ఆకాడమీ ఆఫ్ మోషన్ పిక్షర్స్ అండ్ ఆర్ట్స్, ఆర్చీవ్స్ లో పెడుతున్నట్లు లాస్ ఏంజిల్స్ అకాడమీ వర్గాలు ప్రకటించాయి.
ఈ సందర్భంగా బిగ్ బి స్పందిస్తూ "హ్యాట్సాఫ్ పూరి జగన్నాథ్, బుడ్డా హోగా తేరా బాప్ స్ర్కిప్ట్ సింప్లీ సూపర్బ్, ఈ స్ర్కిప్ట్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్, లాస్ ఏంజిల్స్ తమ ఆర్చీవ్స్‌లో పెట్టడం చాలా గొప్ప విషయం.. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న పూరి జగన్నాథ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాన"ని అన్నారు.
ఈ విషయం డాషింగ్ డైరక్టర్ పూరి స్పందిస్తూ "నాకు ఈ న్యూస్ అమితాబ్ గారు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన అభిమానిగా 'బుడ్డా హోగా బాప్" సినిమా తియ్యడం, ఆ స్ర్కీప్ట్ కి ఇంతటి గౌరవం లభించటం చాలా ఆనందంగా ఉందని" అన్నారు.


Click it and Unblock the Notifications











