twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేశ్యాగృహం నడిపానని.. నన్ను టార్గెట్ చేస్తున్నారా అని భయపడ్డా.. పూరీ

    డ్రగ్ సప్లయర్ కెల్విన్‌తో సంబంధాలున్నట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ

    By Rajababu
    |

    డ్రగ్ సప్లయర్ కెల్విన్‌తో సంబంధాలున్నట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మీడియాపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆరోపణల నేపథ్యంలో వివరణ సేకరించడానికి మాత్రమే నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. బుధవారం పూరీని సిట్ అధికారులు 10 గంటలకు పైగా విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    బాధగా అనిపించింది..

    బాధగా అనిపించింది..

    ‘నాపై డ్రగ్స్ ఆరోపణలు రావడం చాలా బాధగా అనిపించింది. నా టైం బాగోలేదు అనిపించింది. ఇంట్లో చనిపోతే ఎలా ఉంటుందో అలా నా ఇంట్లో అలాంటి పరిస్థితి కనిపించింది. నా భార్య ఏడ్చింది. దాంతో టీవీ చూడటం ఆపేయమని చెప్పాను. అయినా ఆమె బాధపడటం ఆపలేదు’ అని పూరి అన్నారు.

    Recommended Video

    Puri Jagannadh Reveals Names In Tollywood Drug Scandal | Filmibeat Telugu
    పాస్‌పోర్ట్ సీజ్ చేశారని..

    పాస్‌పోర్ట్ సీజ్ చేశారని..

    ‘నాకు ఢిల్లీలో వేశ్యగృహం నడిపే కంపెనీ ఉందని. ఆ వ్యవహారంలో నేను ఇరుక్కొన్నాను అని. దాంతో నా పాస్‌పోర్ట్ సీజ్ చేశారని, ఇలా రకరకాల విషయాలను, అవాస్తవాలను మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. వాటిని చూసి నేను చాలా బాధపడ్డాను’ అని పూరి తెలిపారు.

    ఒక్కరోజు వంద ఆరోపణలు

    ఒక్కరోజు వంద ఆరోపణలు

    ‘ఒక్క రోజులో వంద ఆరోపణలు వచ్చినట్ట కథనాలు ప్రసారం కావడంతో పూర్తిగా హర్టయ్యాను. బ్యాంకాక్‌ వెళ్లి బీచ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా స్క్రిప్ట్‌ రాయడం అలవాటు. ఆ విషయంపై నా నుంచి క్లారిటీ తీసుకోవడం కోసం మాత్రమే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు’ అని పూరీ జగన్నాథ్‌ అన్నారు.

    కుటుంబ సభ్యులు బాధపడ్డారు.

    కుటుంబ సభ్యులు బాధపడ్డారు.

    ‘నాపై మీడియాలో ప్రసారమైన వార్తలు చూసి నా కుటుంబసభ్యులు బాధపడ్డారు. సిట్ అధికారుల ప్రశ్నలకు ఓపికతో జవాబు చెప్పా. కేసు విచారణలో ఉన్నప్పుడు సిట్ అడిగిన ప్రశ్నలపై మాట్లాడకూడదు. అందుకే విచారణ తర్వాత నేను ఏమీ మాట్లాడలేదు’ అని పూరీ వెల్లడించారు.

    మీడియా నన్ను ఫాలో అయింది..

    మీడియా నన్ను ఫాలో అయింది..

    ‘సినిమాలో చూపించిన విధంగానే సిట్‌ ఆఫీసుకు బయలుదేరినప్పుడు నేను ప్రయాణిస్తున్న వాహనం వెంట మీడియా ఛానెళ్ల వాహనాలు నన్ను ఫాలో అవుతూ వచ్చాయి. పరిణామాలు చూస్తుంటే నన్నెవరైనా టార్గెట్ చేస్తున్నారా అనే భయానికి గురయ్యాను. ఇవే పనులు, తప్పులు అందరు చేస్తున్నారు’ అని పూరీ ఆవేదన వ్యక్తం చేశారు.

    చిన్న తప్పు చేస్తే కొండంతలు..

    చిన్న తప్పు చేస్తే కొండంతలు..

    ‘సినిమా వాళ్లు ఎవరైనా చిన్న తప్పు చేస్తే కొండంతలు చేసి చూపిసున్నారు. సంతోషంలో అందరూ తోడుంటారు. కష్టం వస్తే ఎవరూ ఉండరు అని మరోసారి రుజువైంది. మనల్ని మనమే నమ్ముకోవాలనే విషయం మరోసారి తెలిసింది’ అని పూరీ పేర్కొన్నారు.

    అలాంటి చర్యలకు పాల్పడను..

    అలాంటి చర్యలకు పాల్పడను..

    ‘సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు బాధ్యతగా ఉండాలి. చాలా మంది మమ్మల్ని ఫాలో అవుతుంటారు. డ్రగ్స్ మాత్రమే కాదు. అసాంఘిక చర్యలకు పాల్పడను. అలా చేస్తే నా దగ్గర బోలెడంత డబ్బుండేదేమో. కష్టకాలంలో ఒకానొక దశలో సొంత ఇంటిని కూడా అమ్ముకున్నాను’ అని పూరీ అన్నారు.

    English summary
    Director Puri Jagannath given clarity about the investigation of SIT. He speak to a Popular telugu media channel on Thursday night. He expression fear about media huting. His family was upset with this kind of coverage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X