చీప్‌గా బిహేవ్ చేయవద్దని ఆడియో రిలీజ్.. బండ్లకి పూరి స్ట్రాంగ్ కౌంటర్?

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన తాజా చిత్రం చోర్ బజార్. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. పూరి జగన్నాథ్ భార్య లావణ్యను పొగుడుతూ ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు అంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు వాటిమీద పూరి జగన్నాథ్ పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

చర్చనీయాంశంగా

చర్చనీయాంశంగా


పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన బండ్ల గణేష్ కన్న కొడుకు సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ముంబైలో ఏం చేస్తున్నావ్ అన్న, నేనైతే లండన్ లో ఉన్న కొడుకు ఈవెంట్ ఉంది అంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అయినా వచ్చేవాడిని. అంటూ పూరి జగన్నాథ్ భార్య కుమారుడిని, పొగుడుతూ పూరి జగన్నాథ్ మీద తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

గట్టి కౌంటర్

గట్టి కౌంటర్


తాజాగా ఈ విషయం మీద పూరిజగన్నాథ్ స్పందించారు అయితే ఆయన నేరుగా స్పందించలేదు కానీ ఆయన రిలీజ్ చేసిన లేటెస్ట్ మ్యూజింగ్ వింటే మాత్రం బండ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనే నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మ్యూజింగ్ కింద కామెంట్స్ చూస్తే 'బండ్ల గణేష్ స్పీచ్ కి సంబంధించి గట్టి కౌంటర్ ఇచ్చాడు...' అని చాలా మంది కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

చీప్‌గా బిహేవ్ చేయవద్దని

చీప్‌గా బిహేవ్ చేయవద్దని


అయితే అసలు పూరి జగన్నాథ్ ఏమని అన్నారు? అనే విషయానికి వస్తే... ''గుర్తు పెట్టుకోండి! మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం అని అన్నారు. అందుకే, జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా అంటే ఇతరులు చెప్పింది వింటూ ఉంటే మంచిదని అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు... క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు... ఆఫీస్ పీపుల్ కావచ్చు... ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండన్న ఆయన, చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దని అన్నారు.

మాటల మీద

మాటల మీద


మన వాగుడు మన కెరీర్ ను, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుందని అన్నారు. మీకు సుమతి శతకం గుర్తుండే ఉంటుంది. 'నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి' అని! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిదని ఆయన అన్నారు. నీ జీవితం, మరణం నీ నాలుక అంటే మాటల మీద ఆధారపడి ఉంటాయని అంటూ ఉన్న ఒక షార్ట్ షేర్ చేశారు.

 పరోక్షంగా కౌంటర్ ఇస్తూ

పరోక్షంగా కౌంటర్ ఇస్తూ


మాములుగా అయితే ఇది పెద్ద చర్చకు దారి తీసేది కాదు కానీ బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే షేర్ చేయడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు పూరి జగన్నాధ్ మాటల్లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు కానీ, బండ్ల మాట్లాడిన మాటలు తట్టుకోలేకే ఇలా ఆయన పరోక్షంగా కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేశాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X