twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెంపర్: కోటి వసూలైతే తప్ప పూరికి లాస్ తప్పదట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ సక్సెస్ ఫుల్ టాక్‌తో, మంచి కలెక్షన్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు వరకు దాదాపు 38 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

    ‘టెంపర్' నిర్మాణ సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా....పూరికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వకుండా 2.5 కోట్లను వెస్ట్ గోదావరి రైట్స్ కింద ఇచ్చేసారని టాక్. అయితే ఇప్పటి వరకు వెస్ట్ గోదావరిలో రూ. 1.5 కోట్లు మాత్రమే వసూలైందని, మరో కోటి వసూలైతే తప్ప అతనికి రూ. 1కోటి నష్టం తప్పదని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

    Puri Jagannath interest to direct Chiranjeevi

    సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మరింత పికప్ ఇవ్వడానికి చిత్రంలో మరిన్ని సీన్స్ కలుపుతున్నట్లు సమాచారం. లెంగ్త్ ఎక్కువ అవుతుందని భావించి ఎడిటింగ్ లో తొలిగించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో కలువనున్నట్లు తెలుస్తోంది.

    ముఖ్యంగా ...అలి, సప్తగిరి మధ్య ఓ కామెడీని తీసి కట్ చేసేసారట. దాంతో సినిమాలో అది అర్దాంతరంగా ముగిసిన ఫీలింగ్, కామెడీ లేదనే కామెంట్స్ వచ్చాయి. దాంతో వీటిని కలిపి కొత్త వెర్షన్ ని వదులుతారని తెలుస్తోంది. చిత్రం రిలీజైన 30 వ రోజు సందర్భంగా వీటిని యాడ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. 35 కోట్ల షేర్ వద్ద చిత్రం డ్రాప్ అవటం ప్రారంభం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల భోగట్టా. దాంతో టెంపర్ కలెక్షన్స్ 50 కోట్లు చేరుతాయని భావిస్తున్నారు.

    కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.'

    English summary
    "Big B has asked Chiru to comeback to movies and suggested my name to Chiranjeevi garu as director. He also stated that he'd like to play a guest role if I direct the film," said Puri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X