»   » బిగ్ బి చెప్పారు: చిరంజీవి పిలుపు కోసం పూరి వెయిటింగ్

బిగ్ బి చెప్పారు: చిరంజీవి పిలుపు కోసం పూరి వెయిటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘చిరంజీవి గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. చిరంజీవి గారి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉంది. నా వద్ద చిరంజీవి 150వ సినిమాకు తగిన స్టోరీ, స్క్రిప్టు ప్రస్తుతం లేదు. అయినప్పటికీ ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తాను' అంటూ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో 150వ సినిమాపై తనకున్న ఆసక్తి గురించి బయటపెట్టారు.

చిరంజీవి 150వ సినిమా విషయమై గతంలో తన అనుభవాల గురించి వెల్లడిస్తూ...‘బుడ్డా హోగా తెరా బాప్' సినిమాకు సంబందించిన ఓ ఈవెంటులో అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రపోజ్ చేసారు. 150వ సినిమాకు నన్ను డైరెక్టరుగా రికమండ్ చేసారు. నేను డైరెక్టక్షన్ చేస్తే ఆయన గెస్ట్ రోల్ చేస్తానని కూడా చెప్పారు' అని తెలిపారు.

Puri Jagannath interest to direct Chiranjeevi

మరో వైపు....చిరంజీవి 150వ సినిమాకు పూరిని ఫైనల్ చేసే ఆలోచనలో మెగా క్యాంపు ఉందని, అందుకే పూరి తన మనసులోని మాటలను బయట పెడుతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఏ విషయం అనేది త్వరలో తేలనుంది. పూరి డైరెక్షన్ అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఇష్టంగానే ఉన్నారు.

English summary
"Big B has asked Chiru to comeback to movies and suggested my name to Chiranjeevi garu as director. He also stated that he'd like to play a guest role if I direct the film," said Puri.
Please Wait while comments are loading...