»   » పూరి జగన్నాథ్ పెదాలను కొరికేసింది (వీడియో)

పూరి జగన్నాథ్ పెదాలను కొరికేసింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మనకు ఆయన కేవలం సినిమా అంటే ఫ్యాషన్ గల వ్యక్తిగా మాత్రమే తెలుసు. కానీ పూరికి సినిమాలతో పాటు మూగజీవాలంటే కూడా చాలా ఇష్టం. తనకు నచ్చిన వాటిని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటాడు. తాజాగా పూరి జగన్నాథ్ ఒక చిలకను పెంచుకుంటున్నాడు. అది ఆయనపై ప్రేమతో పెదాలను కొరికేసింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో పూరి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసాడు దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Puri Jagannath little baby bird

పూరి జగన్నాథ్ సినిమాల విషయానికొస్తే...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు. గతంలో 'కుమ్మెస్తా' టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 'రుబాబు' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరి ఈ టైటిల్ అయినా ఫైలన్ అవుతుందో? లేదో? త్వరలో తేలనుంది.

ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు. వాస్తవానికి....మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు బండ్ల గణేష్. అయితే ఇతర ప్రాజెక్టుల ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన సినిమాను హోల్డ్‌లో పెట్టాడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయడానికి చాలా సమయం ఉండటంతో ఈ లోగా జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా బండ్ల గణేష్‌కే ఇచ్చాడు.

Post by Puri Jagannadh.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తన సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

English summary
Check out Tollywood director Puri Jagannath's little baby bird video.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu