పీక పిసకాలి...అంటూ పూరి సంచలన వ్యాఖ్యలు
'మనో భావాలు దెబ్బతింటున్నాయని' కనిపిపెట్టిన వాడి పీక పిసకాలి అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా 'బిజినెస్ మేన్' సినిమాలోని 'వి లవ్ బ్యాడ్ బాయ్స్' అనే పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ పూరి ఈ విధంగా వ్యాఖ్యానించారు.
పని పాట లేని వాళ్లే మనోభావాల గురించి పట్టించుకుంటారని, సక్సెస్ ఫుల్ పీపుల్ ఇలాంటివి పట్టించుకోరని, దేవుడంటే నాకు సెంటిమెంటు లేదని, ఇండియాలో మనో భావాలు దెబ్బతిన్నట్లుగా ఏ కంట్రీలోనూ దెబ్బతినడం లేదని....హిందువుల మనో భావాలపై పూరి వెటకారపు వ్యాఖ్యలు చేశారు.
అయితే పూరి వ్యాఖ్యలపై....ఫిర్యాదు దారు రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్త్రీ'ని అగౌరవ పరుస్తూ, ఆమెను ఆటబొమ్మగా చూపిస్తూ, హిందువుల మనో భావాలను దెబ్బతీస్తూ సినిమాలు తీసే అలాంటి వ్యక్తితో మాట్లాడటం సిగ్గు చేటుగా ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











