twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేక పుట్టిస్తున్న మహేష్ బిజినెస్ ప్లాన్...!?

    By Sindhu
    |

    దూకుడు సినిమాకి ఇంకా ఒక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, దానిని పూర్తి చేయడం మానేసి మహేష్ బాబ హడావిడిగా 'ది బిజినెస్ మ్యాన్" షూటింగ్ మొదలు పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉన్నట్టుండి ఇప్పుడీ సినిమా మొదలు పెట్టడమెందుకని అనుకున్నారంత. అయితే దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ నెమ్మదిగా బయటకి పొక్కింది. సినీ కార్మికుల సమ్మె కారణంగా సెప్టెంబర్ 6 నుంచి కొత్త సినిమాలు మొదలు కావడానికి వీల్లేదు.

    అందుకే దూకుడు పాట షూటింగ్ పెండింగ్ పెట్టి ముందుగా అది మొదలుపెట్టేశారు. ఇప్పుడు అక్టోబర్ 31వరకు నిరాటంకంగా బిజినెస్ మ్యాన్ షూటింగ్ చేసుకునే వీలు చిక్కింది. ఈలోగా లోకల్ లో చేసే షూటింగ్ అంతా పూర్తి చేసేస్తే అక్టోబర్ 31 నాటికి విదేశాలకి వెళ్లిపోవచ్చు. బ్యాలెన్స్ పార్ట్ అంతా షూటింగ్ చేసుకుని సమ్మె తర్వాత ఇక్కడికి తిరిగి రావచ్చు. అలా సమ్మె ఎఫెక్ట్ తమ సినిమాపై పడకుండా మహేష్, పూరి భలే స్క్రీన్ ప్లే సెట్ చేశారు కదూ...

    English summary
    Prince Mahesh Babu’s upcoming movie The Business Man, shooting surprisingly started recently. The first schedule will continue till 10th in Hyderabad and second schedule will take place from September 11th to December 25th continuously without any breaks in Hyderabad, Mumbai and Foreign locations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X