For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంగ్రీ జర్నలిజమే కళ్యాణ్ రామ్ ఇజం.... ప్రీ రివ్యూ

  |

  దశాబ్దానికిపైగా సినిమాల్లో నటిస్తూ అడపాదపడా విజయాలు అందుకున్న కల్యాణ్‌రామ్‌.. ఇప్పటివరకు భారీ సూపర్‌హిట్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఆయన తన తాజాచిత్రం 'ఇజం' ద్వారా సూపర్‌హిట్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్‌ చిత్రం కోసం కల్యాణ్‌రామ్‌ ఎంతో కష్టపడ్డారు.

  ప‌నామా పేప‌ర్స్ లీకేజ్ నేప‌థ్యంలోను, మ‌న‌దేశంలో ఉన్న బ‌డాబాబుల నల్ల‌ధ‌నం నేప‌థ్యంలోను ఇజం సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక జ‌ర్న‌లిజం గొప్ప‌ద‌నంతో పాటు అందులో ఉన్న లొసుగుల‌ను కూడా పూరి ఇజంలో చ‌క్క‌గా చూపించాడ‌ట‌. క‌ళ్యాణ్ దేశంలో మూలుగుతున్న వేలాది కోట్ల రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నాన్ని త‌న స్టింగ్ ఆప‌రేష‌న్‌తో బ‌ట్ట‌బ‌య‌టు చేస్తాడ‌ట‌. సరికొత్త స్టైలిష్‌ లుక్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా గురించి టెండ్రీ కబుర్లు ఇవి..

   నిజాయతీ గల జర్నలిస్ట్‌:

  నిజాయతీ గల జర్నలిస్ట్‌:

  ‘‘ప్రతి జర్నలిస్టుకీ ఓ ఐడియాలజీ, థియరీ ఉంటుంది. అవినీతిమయమైన సమాజంలో నిజాయతీ గల జర్నలిస్ట్‌ పోరాటాన్ని ఎలా సాగించాడు? అనే కథాంశంతో మేం తెరకెక్కించిన చిత్రం ‘ఇజం''' అని చెప్పారు పూరి జగన్నాథ్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘ఇజం' చిత్రంతో నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై ఆయనే నిర్మించారు. . ఈ చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో... కొత్త హెయిర్ స్టైల్ తో.. కొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ ఆదితి ఈ సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంకు క‌థ‌, క‌థ‌నంతోపాటు మాట‌లు కూడా పూరినే

  న్యూస్ ఛానెల్ రిపోర్ట‌ర్‌:

  న్యూస్ ఛానెల్ రిపోర్ట‌ర్‌:

  జ‌ర్న‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కే ఇజంలో క‌ళ్యాణ్‌రామ్ ఓ న్యూస్ ఛానెల్ రిపోర్ట‌ర్‌గా క‌నిపిస్తుంటాడు. ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో క‌ళ్యాణ్ కొన్ని భ‌యంక‌ర‌మైన నిజాలు తెలుసుకుంటాడు. ప‌నామా పేప‌ర్స్ లీకేజ్ నేప‌థ్యంలోను, మ‌న‌దేశంలో ఉన్న బ‌డాబాబుల నల్ల‌ధ‌నం నేప‌థ్యంలోను ఇజం సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక జ‌ర్న‌లిజం గొప్ప‌ద‌నంతో పాటు అందులో ఉన్న లొసుగుల‌ను కూడా పూరి ఇజంలో చ‌క్క‌గా చూపించాడ‌ట‌. క‌ళ్యాణ్ దేశంలో మూలుగుతున్న వేలాది కోట్ల రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నాన్ని త‌న స్టింగ్ ఆప‌రేష‌న్‌తో బ‌ట్ట‌బ‌య‌టు చేస్తాడ‌ట‌.

  అందాల భామ ఆదితి ఆర్య:

  అందాల భామ ఆదితి ఆర్య:

  ఇజం ఫ‌స్టాఫ్ లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్‌ట్రాక్‌తో పాటు స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో సాగిపోతుంద‌ట‌. 2015లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ ఎంపికైన అందాల భామ ఆదితి ఆర్యకు ఇది తొలి సినిమా. 2015 మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలోనూ తను పాల్గొన్నది. కల్యాణ్‌ రామ్‌ సరసన టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ భామ అందచందాల పరంగా ట్రైలర్‌లో ఆకట్టుకుంది. రంగస్థలం ప్రవేశం ఉండటంతో అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసినట్టు చెప్తున్నారు. ఇక అదే టైంలో ఎల‌క్ట్రానికి మీడియాలో జ‌రిగే సీన్లు... ఛానెళ్ల‌లో ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో పూరి చూపించాడ‌ట‌. ఫ‌స్టాఫ్ కామెడీగా, జాలీగా గ‌డిచిపోతుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్‌తో అస‌లైన ట్విస్ట్ స్టార్ట్ స్టోరీ అస‌లైన క‌థ‌లోకి ఎంట్రీ అవుతుంద‌ని తెలుస్తోంది.

  మార్షల్‌ ఆర్ట్స్‌ పోరాట సన్నివేశాలు:

  మార్షల్‌ ఆర్ట్స్‌ పోరాట సన్నివేశాలు:

  "ఇజం" ట్రైలర్‌ను బట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉనట్టు తెలుస్తోంది. కారు, బైక్‌ వంటి ఛేజింగ్‌ సీన్లతోపాటు పలు యాక్షన్‌ సీన్లు, మార్షల్‌ ఆర్ట్స్‌ పోరాట సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సినిమాలు తీయడంలో పూరి దిట్ట కావడంతో ‘ఇజం'లో ఆ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాక్షన్‌ సీన్లతోపాటు ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల కల్యాణ్‌ రామ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. సోషల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కంప్లీట్‌ యాక్షన్‌ సినిమా అయిన ‘ఇజం' ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నది.

  లాంటి మ్యాజిక్‌:

  లాంటి మ్యాజిక్‌:

  టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకరు. మహేశ్‌ బాబుతో పోకిరి, బిజినెస్‌ మ్యాన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో టెంపర్‌, రవితేజతో ఇడియట్‌ వంటి భారీ కమర్షియల్‌ హిట్‌ సినిమాలను తెరకెక్కించిన ఘనత పూరిది. కమర్షియల్‌ సినిమాలు తీయడంతో పూరిని మించినోడు లేడంటే అతియోశక్తి కాదేమో. అలాంటి మ్యాజిక్‌ను ‘ఇజం' సినిమాలోనూ పూరి రిపీట్‌ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

   మాస్‌ను దృష్టిలో ఉంచుకుని:

  మాస్‌ను దృష్టిలో ఉంచుకుని:

  ఇక ఈ సినిమా స్టోరీ ఇలా ఉంటే క‌ళ్యాణ్‌రామ్ సిక్స్ ప్యాక్ బాడీ, మోడ‌ర్న్ లుక్స్‌తోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాకు హైలెట్ కానుంద‌ని తెలుస్తోంది. సినిమాలో డైలాగులు కూడా మాస్‌ను దృష్టిలో ఉంచుకుని పూరి ప‌వ‌న్ ఫుల్‌గా రాశాడ‌ట‌. ఈ ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌లు బాగా పేలుతాయ‌ట‌.

  క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే స‌రికొత్త సినిమా:

  క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే స‌రికొత్త సినిమా:

  ఇక‌, 5-7నిమిషాల లెంగ్త్ ఉన్న కోర్ట్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుంద‌ట‌. ఈ సీన్‌లోనూ డైలాగుల పంట పండించాడ‌ట పూరి. ఏదేమైనా ఇజం క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే స‌రికొత్త సినిమాగా నిలుస్తుంద‌న్న టాక్ వ‌స్తోంది.ఇక సెకండాఫ్‌లో సినిమా అస‌లైన క‌థ‌లోకి వెళ్లీ... వికీ లీక్స్, ప‌నామా లీక్స్ వంటి సీరియ‌స్ స‌బ్జెక్ట్ నేప‌థ్యంతో సాగుతుంద‌ని తెలుస్తోంది. సెకండ్ హాఫ్‌లో స‌మాజంలో అవినీతి, కోట్లు కూడ‌బెట్టుకున్న న‌ల్ల‌బాబుల‌పై సెటైర్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. కామెడీ ట్రాక్ హిట్ అయితే, సినిమా మ‌రో రేంజ్‌కి వెళుతుంద‌ని, క‌ళ్యాణ‌రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

  English summary
  The rumours on the social media reveals us that the film ISM revolves around bringing back black money to India from foreign. ISM is an important film for both Kalyan Ram and Puri Jagannadh. As both of them are in flops, they pinned major hopes on this film and are confident that the film will become a huge hit
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X