'నేనింతే' స్టోరీ ఇంతే!(స్పెషల్)

By Staff

Neninthe
తెలుగు చిత్ర పరిశ్రమ నేపధ్యంలో దర్శకుడు పూరీజగన్నాధ్ ,రవితేజా హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నేనింతే రిలీజుకు రెడీ అయింది. ఇక ఈ సినిమా విశేషాలు తెలుగు పరిశ్రమ అంతటా చక్కర్లు కొడుతున్నారు. టాలీవుడ్ పై ఈ చిత్రం మంచి విశ్లేషణ గా కొనసాగుతుందని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో సాయి రామ్ కారెక్టర్ బాగా వచ్చిందని తెలుస్తోంది. అతను ఓ పెద్ద హీరో ఫ్యాన్. తన హీరో సినిమా వంద రోజులు వేయకుండా తొబయ్యో రోజునే తీసేస్తున్నాడని ధియోటర్ వాడితో గొడవపడతాడు. అప్పుడు ఆ దియోటర్ యజమాని వెళ్ళి ఓ పది లక్షలు తెచ్చి కడితే లాస్ భరించి నడుపుతానంటాడు. దాంతో అతనింటికి వెళ్ళి చెల్లి పెళ్ళి కోసం ఉంచిన పది లక్షలు తెచ్చి కడతాడు. పెళ్ళి ఆగిపోతుంది. ఈ విషయం తెల్సుకున్న అతని తల్లి తెలంగాణా శకుంతల గుండెనెఫ్పెతో చనిపోతుంది. అతనూ వెళ్ళి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు హీరో వెళ్ళి కాంపనసేషన్ గా ఆ మొత్తాన్ని అందచేస్తాడు.

అలాగే కృష్ణ మాదిగ మీద కూడా ఓ డైలాగ్ ఉందిట. దానిలో కొన్ని కులాలు వాళ్ళు గొడవ చేస్తున్నాయి అని ఉన్న దాన్ని సెన్సార్ వాళ్ళు మార్చి కొన్ని సమాజాలు వాళ్ళు అని మార్చారని తెలుస్తోంది. అలాగే పూరీ ఈ సారి రివ్యూలు రాస్తున్న వెబ్ సైట్స్ మీద కూడా తన వ్యంగ్యాస్త్రాన్ని ఎక్కు పెట్టాడని సమాచారం. సినిమా చూడకండానే అమెరికాలో ఉండే వారు వెబ్ సైట్ వారు రివ్యూ లు చదివి ప్లాప్ అని నిర్ణయానికి రావటం చూపెట్టాడని చెప్తున్నారు.అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ వారి రివ్యూలను కూడా విమర్శ చేసాడని తెలుస్తోంది. ఇక స్వాతి మేగజైన్ పై కూడా ఓ డైలాగ్ ఉంటే దాన్ని ముత్యం అని మార్చారు. అలాగే ఇడ్లి విశ్వనాధ్ అనే పేరుతో ఓ కామెడీ డైరక్టర్ పాత్రను సృష్టించి బ్రహ్మానందం చేత చేయించాడు. అది నవ్వులు పంచుతుందని చెప్తున్నారు. అయితే ఆ పాత్ర కూడా ఓ పాపులర్ డైరక్టర్ మేనరిజమ్స్ ని అనుకరిస్తూ వెటకారం చేస్తుంది.

ఇక ఈ సినిమాలో రవితేజ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసి కథలు పట్టుకుని తిరుగుతూంటాడు. ఓ నిర్మాత నుండి మరొకడి దగ్గరకు మారుతూంటాడు. చివరకు వి.వి.వినాయిక్ దగ్గరకు ఆ స్క్రిప్టు చేరితే అతను అవకాశమిస్తాడు. అలాగే సుబ్బరాజు ఈ సినిమాలో ఏక్ట్ చేసే హీరోలా కన్పిస్తాడు. వేణు మాధవ్ అయితే సింధిల్ అనే పేరు మార్చుకుని తమిళ వాడిలా బిల్డప్ ఇస్తూ అవకాశాలు కోసం స్టూడియోలు చుట్టూ తిరుగుతూంటాడు. అలాగే టైటిల్ సాంగ్ లో అందరి హీరోలు,హీరోయిన్స్ కనపడతారు.అలాగే రియల్ ఎస్టేట్,మాఫియా,గూండాయిజం సినిమా ఫీల్డులో ఎలా పాతుకుపోయి,రాజ్యమేలుతున్నాయో చూపెట్టే ప్రయత్నం చేసాడంటున్నారు.ఇవన్ని బయిట వినపడుతున్న విశేషాలు. వీటిన్నటి బట్టి చూస్తూంటే తెలుగు పరిశ్రమను బాగా అధ్యయినం చేసే ఈ తరహా నిర్మాణానికి పూరి పూనుకున్నట్లు అర్ధమవుతుంది. ఇలా ఇన్ని విశేషాలతో వస్తున్న ఈ సినిమా అందరి అంచనాలు మించి హిట్టువుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. బెస్ట్ ఆప్ లక్ పూరీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X