twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా, ఇలియానా 'నేను నా రాక్షసి' చిత్రం విడుదల తేదీ ఫిక్స్

    By Srikanya
    |

    లీడర్ చిత్రంతో పరిచయమైన దగ్గుపాటి రాణా, ఇలియానా కాంబినేషన్ లో పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న 'నేను నా రాక్షసి' చిత్రం జనవరి 14 న విడుదల చేయటానికి నిర్ణయించారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిల్మ్ నాయర్ జనర్ లో రూపొందుతోంది.ఇక ఈ రిలీజ్ విషయమై బుజ్జి మీడియాతో మాట్లాడుతూ...సంక్రాంతి పండగ రోజున వినోదం పండించడానికి మా సినిమా సిద్ధమవుతోంది. పేరుకు తగ్గట్టే సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. పూరి కథను నడిపించిన విధానం కొత్తగా ఉంటుంది. ఇంతకీ ఇలియానాని రాక్షసి అని రాణా ఎందుకు పిలిచాడో తెర మీదే చూడండి. ఇటీవలే బ్యాంకాక్‌లో పాటల్ని చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము అన్నారు.

    నేనూ నా రాక్షసి చిత్రంలో డైలాగులు హైలెట్ గా నిలుస్తాయంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వరస ప్లాప్ ల్లో ఉన్న పూరి తన బలం అయిన డైలాగులుని ఈ చిత్రంలో చూపనున్నాడని, సినిమా కేవలం డైలాగులు కోసమే ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు. పూరీ జగన్నాధ్ తనకు తెలిసిన సైకాలజి, తన జీవితానుభవాలు, తాను నమ్మే ఓషో సిద్దాంతాలు,తన గురువు రామ్ గోపాల్ వర్మ లాజిక్ లు కలగలపి ఈ చిత్రం డైలాగులు వండాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్‌ రాథోడ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X