'గబ్బర్ సింగ్' నిర్మాతతో మహేష్ బాబు చిత్రం ఖరారు

By Srikanya

హైదరాబాద్ : పవన్ తో చేసిన 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ కావటంతో వరస స్టార్స్ చిత్రాలతో బండ్ల గణేష్ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై మరో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో ఆయన చిత్రం కమిటయ్యారని సమాచారం. పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. 2013 వేసవి లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రేసీ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది.

బిజినెస్ మ్యాన్ హిట్టవగానే వెంటనే పూరీ జగన్నాధ్ తను మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం చేస్తున్నానని ప్రకటించారు. అంతేగాక తాను ఓ లైన్ కూడా రెడీ చేసానని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేస్తాను అన్నారు. అయితే ఆయన వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ఆ విషయమే ఎత్తటం లేదు. దాంతో రకరకాల అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫద్యంలో ఆయన మీడియాతో ఈ విషయమై క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ మ్యాన్ 2 సినిమా ఇక లేనట్టే. ఆ స్థానంలో మహేష్‌ కోసం కొత్త కథ రాస్తా అన్నారు. కాబట్టి ఈ చిత్రం ఓ కొత్త కథ అని తెలుస్తోంది.

కెమెరామెన్ గంగతో మంచి ఊపు మీద ఉన్న పూరీ జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ తో తదుపరి చిత్రం హడావిడిలో ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .

చిత్రం గురించి నిర్మాత గణేష్ మాట్లాడుతూ -''పూరి అన్ని చిత్రాల్లోకెల్లా ఇది వ్యత్యాసంగా ఉంటుంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అరవింద్‌గారిని అడుగుతున్నాను. బన్నీ నా రోల్ మోడల్. చాలా కష్టపడతాడు. 'నాయక్' కోసం అమలాపాల్ చేసిన డాన్స్ చూశాను. బ్రహ్మాండంగా చేసింది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నాను. నిర్మాతగా నా కెరీర్‌ ఆయనతోనే మొదలుకావాల్సింది. ఇప్పటికి కుదిరింది. వచ్చే నెల తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామ'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X