హీరోలో ఫైర్ లేదనే వద్దనుకుంటున్నా: పూరీ జగన్నాధ్
బుడ్డా హోగా తేరా బాప్ చిత్రం విడుదల తర్వాత జరిగిన ఎక్సపీరియన్స్ లు చాలా బ్యాడ్ అంటున్నారు పూరీ జగన్నాధ్. అందుకేనేమో ఆయన తన బిజినెస్ మ్యాన్ చిత్రం హిందీ వెర్షన్ లో హీరోగా అభిషేక్ ను వద్దనుకుంటున్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీసెంట్ గా అభిషేక్ రీసెంట్ ట్రాక్ రికార్డు చూస్తే... ఆయన్ని బిజినెస్ మ్యాన్ రీమేక్ కు తీసుకోవటం అవసరం అని అర్దమైంది. ఆయలో ఈ పాత్ర డిమాండ్ చేసినంత ఫైర్ లేదు. అందుకే మహేష్ బాబునే హిందీ రీమేక్ కు కూడా తీసుకుందామనుకుంటున్నాను అన్నారు. అయితే మహేష్ హిందీని అంత ప్లాయింట్ గా మాట్లాడకపోయినప్పటికీ ఆయనే బెస్ట్ ఛాయిస్ అన్నారు. ఆయన పాపులారిటిని పెంచటానికి హిందీ మాట్లాడక పోవటం అనేదిచ అస్సలు అడ్డంకి కాదు అన్నారు.
ఈ విషయమై మహేష్ మేనేజర్ మాట్లాడుతూ..మేము హిందీ రీమేక్ గురించి పూరీ తో డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు మా దృష్టి అంతా ఒరిజనల్ వెర్షన్ విడుదల మీదే ఉంది అన్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లేటవటంతో విడుదల తేదీని జనవరి 13వ తేదీకి మార్చారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మహేష్-కాజల్ లిప్‌లాక్, మాఫియా కథాంశానికి తగ్గట్టు కొన్ని ఘాటు సన్నివేశాలు ఉన్న దృష్ట్యా..సెన్సార్ 'ఎ' సర్టిఫికేట్ జారీ చేసిందని సమాచారం. మహేష్ పెర్ఫామెన్స్, పూరి పంచ్ డైలాగులు ఈ చిత్రాన్ని 'పోకిరి', 'దూకుడు'లను మించిన వసూళ్ల ప్రభంజనం దిశగా తీసుకళతాయని అందరూ అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











