దయానాయక్ జీవిత చరిత్రపై పూరీ సినిమా
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితాన్ని అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు సంభందించిన వారిని కలవటం,ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవటం చేస్తున్నారని సమాచారం. అయితే ఇదంతా ఎందుకు అంటే గోపీచంద్ హీరోగా నిర్మించనున్న గోలీమార్ చిత్రం కోసమని తెలుస్తోంది. ఇందులో గోపిచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టు పాత్రను పోషిస్తున్నారు. ఇక ఏక్ నిరంజన్ చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రంపైనే పూర్తి కాన్సర్టేట్ చేస్తున్నారని, మరో పోకిరి లా రికార్డులు సృష్టించటానికి కసరత్తులు చేస్తున్నారని యూనిట్ మెంబర్స్ అంటున్నారు. ఇక దయానాయక్ జీవితం ఆధారంగా కన్నడంలో ఓ చిత్రం వచ్చింది.అది తెలుగులో కూడా డబ్బింగైంది. అలాగే జె.డి చక్రవర్తి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన సిద్దం కూడా దయానాయక్ బయోపిక్ అని ప్రచారం చేసారు. ఇక గోపీచంద్ కూడా శంఖం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో ఈ గోలీమార్ పైనే దష్టి పెట్టినట్లు వినపడుతోంది. ఏదైమైనా ఇద్దరికీ ఇది అత్యవసరమైన హిట్ కావాల్సిన కాలం.కాబట్టి గోలీమార్ ని గ్యారెంటీ హిట్ గా మలుస్తారని ఆశిద్దాం. అలాగే ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. దేశముదురు అనంతరం పూరీతో ఆమె చేస్తున్న చిత్రం ఇదే. ఇక గోపీచంద్, హన్సికల తొలి కాంబినేషన్ గోలీమార్.


Click it and Unblock the Notifications











