వాడు లేడు.. చచ్చిపోయాడు: విషాదంలో దర్శకుడు పూరి జగన్నాధ్

Recommended Video

Tollywood Director Puri Jagannath's Dog Jax No More || Filmibeat Telugu

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ విషాదంలో మునిగిపోయారు. తనకు ఎంతో ఇష్టమైన జాక్స్ చనిపోవడమే ఇందుకు కారణం. జాక్స్.. పూరి పెంపుడు కుక్క. ఆయనకు జంతువులున్నా, పక్షులన్నా ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాక్స్ మరణం పూరిని కలిచివేసింది.

జాక్స్ మరణ వార్తను వెల్లడిస్తూ పూరి జగన్నాధ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. జాక్స్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే సాంప్రదాయ బద్దంగా జాక్స్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

అప్పుడు పెంచే పరిస్థితి లేక ఫ్రెండుకు ఇచ్చేశా

అప్పుడు పెంచే పరిస్థితి లేక ఫ్రెండుకు ఇచ్చేశా

‘వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. ఒకానొక టైంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండుకి ఇచ్చేశాను. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేశాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు' అని పూరి గుర్తు చేసుకున్నారు.

వీడిని చాలా బాధ పెట్టాను

వీడిని చాలా బాధ పెట్టాను

‘‘మళ్లీ తీసుకొచ్చాక నా దగ్గరకు వచ్చేవాడు కాదు, నా వైపు చూసేవాడు కాదు. తోక కూడా ఊపి ఇప్పటికీ 8 సంవత్సరాలైంది. నేను లైఫ్‌లో ఎంత మందిని బాధపెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధ పెట్టాను. వాడు ఇక లేడు. ఈ రోజు వాడి చివరి రోజు'' అంటూ పూరి ఎమోషనల్ అయ్యారు.

సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఓదార్పు

సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఓదార్పు

జాక్స్ పోయిన బాధలో ఉన్న పూరి జగన్నాధ్‌ను ఓదారుస్తూ... చార్మి, నిధి అగర్వాల్, హేమంత్ మధుకర్, ఎస్కేఎన్, పలువురు అభిమానులు ట్వీట్స్ చేశారు. జాక్స్ విషాదం నుంచి పూరి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్విట్టర్ పోస్టుకు కామెంట్స్ పెట్టారు.

పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం మే లేదా జూన్లో విడుదల చేసేందుకకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X