twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెంటిమెంట్ విత్ ఎంటర్టైన్మెంట్ ('లోఫర్‌' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : కంచె చిత్రంతో తనలోని నటుడుని ఆవిష్కరించుకుని క్లాస్ ఆడియన్స్ దగ్గరైన వరుణ్ తేజ ఈసారి మాస్ అవతారంలో దిగుతున్నాడు. తల్లి సెంటిమెంట్ తో పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా రూపొందింది. జ్యోతిలక్ష్మితో వెనక బడ్డ పూరి ఈ సినిమాని తనదైన ట్రేడ్ మార్క్ డైలాగులతో రూపొందించి తిరిగి ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేసాడని తెలుస్తోంది.

    వరుణ్ తేజ మాట్లాడుతూ... ‘‘ఇందులో నేనో దొంగని. పూరి సినిమాల్లో కథానాయకుడు ఎలా ఉంటాడో.. అంతే జోష్‌తో సాగే పాత్ర ఇది. పూరిగారు ‘లోఫర్‌' అనే టైటిల్‌ చెప్పగానే కంగారుపడిపోయా. రషెస్‌ చూసుకొన్నాక ఇదే సరైన టైటిల్‌ అనిపించింది. మదర్‌ సెంటిమెంట్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నిజానికి అది నచ్చే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ఒక దశలో ఈ చిత్రానికి ‘అమ్మ' అనే పేరు పెడదామనుకొన్నాం''అన్నారు .

    పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.... భర్త మీద కోపంతో తల్లి తన కొడుకుని కావాలనే లోఫర్‌గా పెంచుతుంది. టైటిల్‌ 'లోఫర్‌' అయినంత మాత్రాన సినిమా అలా ఉండదు. ఇందులో అమ్మ చని పోయిందని కొడుకు (హీరో) చెబుతాడు. కొడుకు చని పోయాడని తల్లి చెబుతుంది. తండ్రి చనిపోయాడని కొడుకు చెబుతాడు. ఒకరిపై ఒకరు ఇలా చెప్పుకుంటారు. కాని అందరూ బతికే ఉంటారు. ఒక్క మదర్‌ సెంటిమెంట్‌ తప్ప దీనికి 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి పోలికే లేదు. ఇందులోని మదర్‌సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అన్నారు.

    Puri Jagannath's Loafer preview

    ముఖ్యంగా మదర్‌ సాంగ్‌లో అద్భుతంగా నటించాడు. ఇటీవల చిరంజీవిని కలిసి వీడియో క్లిప్‌ చూపిస్తే, 'వరుణ్‌ ఇంత బాగా చేశాడా' అని పది నిమిషాల పాటు మాట్లాడారు. ఇక తల్లీదండ్రులుగా పోసాని, రేవతి అదరగొట్టారు. మంచి తల్లి, చెడ్డ తండ్రి మధ్య వచ్చే క్లాష్‌ ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.

    నటీనటులు:వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు
    ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌,
    ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ,
    అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ,
    కో డైరెక్టర్‌: శివరామకృష్ణ,
    కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌,
    ఫైట్స్‌: విజయ్‌,
    సంగీతం: సునీల్‌ కశ్యప్‌,
    సినిమాటోగ్రఫీ: పి.జి.వింద,
    ఆర్ట్‌: విఠల్‌ కోసనం,
    ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌,
    సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌,
    నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ,
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
    విడుదలతేదీ:17, డిసెంబర్ 2016.

    English summary
    Varuntej is now getting ready with his third movie and this time he selected a mass entertainer. Puri Jagannadh directed the movie which is said to have an emotional story about a mother searching for his son.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X