20 కోట్ల ఖర్చుతో పూరి జగన్నాథ్ లగ్జరీ ఇల్లు (ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్‌లో సకల సౌకర్యాలు, అద్భుతమైన ఇంటీరియర్స్ కూడిన విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారు. ఇంటితో పాటు తన సినిమా ఆఫీసు కార్యకలాపాలకు, స్టోరీ డిస్కర్షన్స్‌కు ఉపయోగ పడేలా ప్రత్యేకంగా ఈ ఇంటిని డిజైన్ చేసారు.
ఇందులో వాడిన ఫర్నీచర్, గోడలకు ప్రత్యేకమైన రంగులు, ప్రత్యేకమైన డిజైన్స్.....ఇలా మొత్తం కలిసి రూ. 20 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.34లో ఈ ఇంటిని నిర్మించారు. ఆఫీస్ స్పేస్ కోసం 18000 చదరపు అడుగులు కేటాయించారు.
దాదాపు సంవత్సర కాలం పాటు ఈ ఇంటి నిర్మాణం జరిగింది. కొత్త ఇంటిని ఇటీవలే ఓపెన్ చేసారు. ఈ సందర్భంగా తన సన్నిహితులైన రామ్ గోపాల్ వర్మ, ప్రకాష్ రాజ్ మరికొందరికి పార్టీ కూడా ఇచ్చారట పూరి. ఇల్లు, ఆఫీస్, రిసార్ట్, లాంజ్ ఇలా అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకునే వీలుందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్లు పూరి తన సన్నిహితులతో చెబుతున్నారట.
స్లైడ్ షోలో పూరి జగన్నాథ్ కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు....

పూరి జగన్నాథ్ గుహ
తన ఇంటిని పూరి జగన్నాథ్ కేవ్ (గుహ) అని పిలుచుకుంటున్నారు. ఈ ప్రపంచం ఓ అడవి, నేనొక జంతువుని, ఇది నా గుహ అంటున్నారట పూరి.

డిజైన్ చేసింది ఎవరంటే...
పూరి జగన్నాథ్ ఇంటిని హైదరాబాద్ సిటీకి చెందిన జయా కిరణ్ అనే డిజైనర్ డిజైన్ చేసారు.

ఆఫీసు, ఇల్లు, బార్, థియేటర్
ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పూరి జగన్నాథ్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్‌లో బెడ్రూమ్స్, బార్, చిన్న హోం థియేటర్ ఏర్పాటు చేసారు.

ఖరీదైన ఉపకరణాలు
ఈ ఇంటి కోసం ఖరీదైన ఉపకరణాలు వాడారు. ఫ్లోరింగ్ కోసం కాలిఫోర్నియా గ్రే స్టోన్ ఉపయోగించారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. తన అభిరుచికి తగిన విధంగా విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారు పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











