డ్రగ్స్ కేసు: ఎక్సైజ్ ఆఫీసులో మహేష్ బాబులా ఆకాష్ పూరి ఫోజులు!

పూరి డ్రగ్స్ కేసు విచారణ బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్ ఆఫీసుకు పూరితో పాటు కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరాం హాజరయ్యారు.

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు బుధవారం విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరితో పాటు ఆయన తనయుడు ఆకాష్, తమ్ముడు సాయిరాం శంకర్ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు.

అక్కడికి వెళ్లిన తర్వాత పూరి జగన్నాథ్ విచారణ నిమిత్తం లోనికి వెళ్లగా.... ఆకాష్, సాయిరాం శంకర్ కార్యాలయం ఆవరణలో గడిపారు. ఈ సందర్భంగా కొందరు ఎక్సైజ్ సిబ్బంది ఆకాష్ పూరి, సాయిరాం శంకర్‌లతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

అచ్చం మహేష్ బాబులా ఉన్నావే...

అచ్చం మహేష్ బాబులా ఉన్నావే...

ఆకాష్ పూరి వద్దకు వచ్చిన కొందరు సిబ్బంది హైటు, పర్సనాలిలో అచ్చం మహేష్ బాబులా ఉన్నావే అంటూ పొగడ్తలు గుప్పించినట్లు సమాచారం. కొందరు ఆకాష్‌తో కలిసి సెల్పీలు దిగారు.

Recommended Video

Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
సందడి వాతావరణం

సందడి వాతావరణం

ఓ వైపు ఎక్సైజ్ కార్యాలయం లోపల పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతుంటే.... కార్యాలయం బయట ఆకాష్ పూరి, సాయిరాం శంకర్ సందడి కనిపించింది.

పూరికి మద్దతు

పూరికి మద్దతు

కాగా....డ్రగ్స్ కేసుకు సంబంధించి పూరికి మద్దతు లభిస్తోంది. పారితోషికంగా కోట్లు తీసుకునే పూరీ, వేల కోసం డ్రగ్స్ వ్యాపారం చేస్తానంటే నమ్మబోనంటునారు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న. ఆయన డ్రగ్స్ తీసుకుంటూ వేరే వాళ్లకు ఎవరికైనా ఇచ్చుంటే మాత్రం అది నేరమవుతుందని, ఆ విషయం విచారణలో తెలుస్తుందని అన్నారు. ఇక డ్రగ్స్ అమ్మకాలు చెక్కుల ద్వారా జరుగుతాయని కూడా తాను భావించడం లేదని, డ్రగ్స్ కోసం రూ.4,30,021 చెక్కును ఎవరూ ఇవ్వరని, ఏ ఈవెంట్ మేనేజ్ కోసమో పూరీ జగన్నాథ్ దీన్ని కెల్విన్ కు ఇచ్చి వుండవచ్చని అన్నారు.

ఛార్మి విచారణ ఇపుడు కాదు

ఛార్మి విచారణ ఇపుడు కాదు

కాగా డ్రగ్స్ కేసులో గురువారం కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని పోలీసులు విచారించారు. పూరికి చాలా సన్నిహితంగా ఉండే ఛార్మీని ఈ నెల 26న విచారించనున్నారు. వాస్తవానికి 26న న‌టుడు న‌వ‌దీప్‌ను విచారించాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా అధికారులు ఈ తేదీల్లో మార్పులు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X