twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ :పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇస్తు్న్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మరోసారి తన గొంతును ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ గా ఇవ్వనున్నారు. ఆ చిత్రం మరేదో కాదు... పి.బి.మంజునాథ్‌ తొలిసారి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌. తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్‌ ఈ సినిమాను నిర్మించారు. రఘు కుంచే ఈ చిత్రానికి బాణీలు అందించారు. రీసెంట్ గా ఈ ఆడియో వేడుకను మధుర శ్రీధర్‌ అట్టహాసంగా చేశారు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    Puri Jagannath's Voice-Over For L&G

    మధుర శ్రీధర్ మాట్లాడుతూ- టీమ్ అందరం కలిసి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాం. కథను ప్రధానం చేసి రూపొందించిన చిత్రానికి ఉదాహరణగా ఈ చిత్రం నిలుస్తుంది. మల్టీస్టారర్ చిత్రంగా అందరు యువకులతో రూపొందించాం. సంజీవరెడ్డిని ‘ఓం మంగళం మంగళం' సినిమాకు దర్శకుడిగా పరిచయం చేయనున్నామన్నారు. రఘు కుంచె అందించిన పాటలు అందరికీ నచ్చుతాయని తెలిపారు.

    యువతరం హీరోలతో మల్టీస్టారర్ చిత్రంగా సినిమా రూపొందింది. బుర్రకథ పాట సూపర్‌హిట్. మొత్తం ఆరు పాటలతో రూపొందించిన సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర దర్శకుడు పిబి మంజునాథ్ తెలిపారు. సోషల్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కథ, కథనాలతో చిత్రం రెండు గంటలు ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా సోషల్ నెట్‌వర్క్ ఉపయోగించేవారు సినిమాకు అభిమాని అవుతారని సహ నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు.

    మహాత్‌ రాఘవేంద్ర, చైతన్య కృష్ణ, అడవి శేషు, కమల్‌ కామరాజ్‌, స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌, తేజస్విని, ఈ సినిమాలో నటించారు. రాజ్‌ కందుకూరి సమర్పణలో షిరిడి సాయి కంబైన్స్‌ పతాకంపై యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Madhura Sreedhar’s ‘Ladies & Gentlemen’ is all set to hit the screens on January 23, 2015. After listening to the concept of ‘Ladies & Gentleman’, director Puri Jagannath was thrilled with the concept and he agreed to give his voice-over for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X