మహేష్ 'బిజినెస్'తో పూరికి పది కోట్ల షేర్..!?

By Sindhu

సంపాదించినది మొత్తం ముప్పయ్ కోట్ల అప్పుల్తో మిగిలిన పూరి జగన్నాథ్ ఆ అప్పులన్నీ తీర్చేసి ఇప్పుడు పూర్తి ఉత్సాహంతో ఉన్నాడు. అదే ఉత్సాహంతో 'ది బిజినెస్ మ్యాన్' సినిమాకి 'పోకిరి'ని తలదన్నేలా సిద్దం చేశాడని అంటున్నారు. దూకుడు విడుదలకి ముందే సెట్స్ మీదకి వెళ్లిన ఈ చిత్రం త్వరలో విడుదలకి సిద్దంగా ఉన్న అన్ని చిత్రాకంటే క్రేజీ అంటే అతిశయోక్తి కాదు.

దూకుడు సాధించిన ఘన విజయం కారణంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాల్లో ఆర్ ఆర్ మూవీమేకర్స్ సొంతంగా రిలీజ్ చేసుకుంటోంది. రెమ్మూనరేషన్ కాకుండా ప్రాపిట్స్ లో షేర్ తీసుకునే అలవాటున్న పూరి తన సినిమాలని తక్కువలో తీసి పారేస్తూ ఉంటాడు. కనుక దూకుడ వల్ల ఈ చిత్రానికి పెరిగిన క్రేజ్ కారణంగా టేబుల్ ఫ్రాఫిట్సే ఘనంగా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం కనుక విజయవంతమైతే పూరి తన షేర్ గా పది కోట్లు రాబట్టుకున్నా ఆర్చర్యం లేదని అంటున్నారు. పోగుట్టుకున్న చోటే వెతుక్కోవడమంటే ఇదేనేమో...!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X