సంజన సూపర్ గురూ...అంటున్నారు బుజ్జిగాడు కి పనిచేసిన వాళ్ళు.మొగుడు పెళ్ళా ఓ బాయ్ ప్రెండు అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అందం సంజన. మర్డర్ కి ఫ్రీమేక్ అయిన ఆ సినిమాలో ఆమె నటన అందాల ప్రదర్శన మల్లికా షెరావత్ ని మించిపోయింది.దాంతో ఆమె క్రేజి ప్రాజెక్టు బుజ్జిగాడు మేడిన్ చెన్నై లో సెకండ్ హీరోయిన్ గా సెట్ అయ్యింది. అలాగే పూరీ కూడా మొహమాట పడకుండా ఆమెని బుజ్జిగాడు లో కూడా ఓ రేంజిలో చూపాడని తెలుస్తోంది. ఎక్స్ పోజింగ్ కి వెనుకాడని ఆమె అందం ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. కాని పబ్లిసిటీలో మాత్రం ఆమెని చూపే ప్రయత్నం పూరీ చేయటం లేదట. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకుడు ఊహించకుండా లభించే అందాల ప్రదర్శన కి అదిరిపోవాలని ఆలోచనట. అందుకే ప్రభాస్,త్రిష మాత్రమే బయిట ఎక్స్ పోజ్ అవుతున్నారు.వెరైటీ థాట్ కదా !