ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు హీరో కాబోతున్నాడు. ప్రముఖ కెమెరామెన్ పి.జి.విందా దర్శకత్వంలో రెడీ కానున్న చిత్రంలో అతను పూర్తి స్ధాయిలో నటించనున్నాడు. స్కూల్ నేఫద్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి పూరీనే పెట్టుబడి పెడుతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ కుర్రాడు ఇప్పటికే చిరుత సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో నటించాడు. రామ్ చరణ్ తేజకు చిన్నప్పుటి రూపం గా చేసిన ఈ కుర్రాడు అప్పట్లో మంచి ఈజ్ తో చేసాడని పేరు తెచ్చుకోవటంలో పరిశ్రమలో చాలా మంది దృష్ఠి అతనిపై పడింది. అయితే పూరీతో అవసరమున్నవారు కూడా ఇది అడ్డం పెట్టుకుని రావటం చూసిన పూరి వేరే వాళ్ళ చిత్రాల్లో చేయటానికి ఫర్మిషన్ ఇవ్వలేదు. అందులోనూ కుర్రాడు చదువులో బిజీగా ఉండటం కారణంగా చూపెట్టాడు. కానీ ఇప్పుడు పి.జి.విందా తనకు సన్నిహితుడు కావటం అతని చెప్పిన సబ్జెక్టు నచ్చటంతో పచ్చజెండా ఊపినట్లు సమచారం.పి.జి.విందా వినాయకుడు సినిమాకు కెమెరామెన్ గా చేసారు.