‘లవ్లీ’ గురించి పూరి జగన్నాథ్
ఆది-శాన్వి జంటగా బి.జయ దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు నిర్మిస్తున్న చిత్రం 'లవ్లీ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ చిత్ర యూనిట్ ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ...''లవ్లీ సాంగ్స్ చూస్తుంటే చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఆ కుర్రాడిలో చాలా కసి ఉంది. ఆది ఫాదర్ సాయికుమార్‌కు మీ అబ్బాయి పెద్ద హీరో అవుతాడని చెప్పాను. నిజంగానే ఆ క్వాలిటీస్ అన్నీ ఆదిలో ఉన్నాయి. నేను 'లవ్లీ' సాంగ్స్ లో ప్రతి షాట్ లోనూ అదినే చూశానంటే రీజన్ తనలో ఉన్న ఎనర్జీనే. కొత్త హీరోయిన్స్ శాన్వి కూడా చాలా అందంగా ఉంది. సినిమాకి అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తనని నేనెప్పుడో పదేళ్ల క్రితమే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తావా అని అడిగితే 'నేనింకా చిన్న పిల్లాడ్ని సార్' అన్నాడు. కానీ ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు. అల్‌రెడీ బుడ్డా, నేను నా రాక్షసి సినిమాలకు నాకు వర్క్ చేశాడు. తనలో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ సాంగ్ ఫెంటాస్టిక్‌గా అనిపించింది. సినిమా మంచి విజయం సాధించిస్తుందనే నమ్మకం ఉంది ..అల్ ది బెస్ట్'' అన్నారు.
డైరెక్టర్ జయ మాట్లాడుతూ...''నేను పర్సనల్ గా పూరి అభిమానిని. ఆయన సినిమాలు చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంటాయి. మా లవ్లీ సినిమాలోని హీరో క్యారెక్టర్ కూడా పూరిగారి స్టయిల్లోనే డిజైన్ చేశాం. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పేరు లావణ్య. పూరి గారి వైఫ్ పేరు కూడా లావణ్యే. హీరో క్యారెక్టర్ పేరు ఆకాష్..పూరి గారి కొడుకు పేరు కూడా ఆకాష్ కావడం కాకతాళీయంగా జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ నడిపే కోటి రూపాయల బెంజ్ కారు పూరి గారిదే, మా సినిమా కోసం ఆయన కారు పంపించడమే కాకుండా ఎన్నో విషయాల్లో సపోర్టివ్ గా ఉన్నారు'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











