గన్నుల ఫ్యాక్టరీ అంటే పవన్ డేట్స్: పూరి జగన్నాధ్
విలన్‌ది గన్నుల ఫ్యాక్టరీ. ఎలా పడితే అలా కాల్చేసుకోవచ్చంటే పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేస్తారు. సినిమా అంతా అవుట్‌డోర్‌లోనే అంటే ప్రభాస్ రెడీ అయిపోతారు. ఈ సినిమాతో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటే ఎన్టీఆర్ కుమ్మేద్దాం అంటారు. నెలరోజుల్లో సినిమా తీసేద్దాం అంటే రవితేజ ఓకే అనేస్తారు. ఇప్పుడు సినిమా మొదలుపెడదాం... అయితే ఎప్పుడు పూర్తి చేస్తామో మాకే తెలీదు అంటే మహేష్ వెంటనే డేట్లు ఇచ్చేస్తారు. ఇవన్నీ ఇండస్ట్రీలో ప్రాచుర్యంలో ఉన్న జోక్స్. ఏది ఏమైనా ఈ సినిమాతో మహేష్ మీద ఉన్న అపప్రద తొలగిపోతుంది. మహేష్‌తో సినిమా చేయడం ఒక మత్తు. డెరైక్టర్‌కి కిక్కిస్తాడు అంటూ పూరీ జగన్నాధ్ సరదాగా తనతో పనిచేసిన హీరోల గురించి చెప్తూ మాట్లాడారు.
బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ లో ఆ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ విధంగా స్పందించారు. ఇక 'బిజినెస్‌మేన్'తో మహేష్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుంది'' అని పూరి జగన్నాథ్ చెప్పారు. మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్ జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న 'బిజినెస్‌మేన్' ఆడియో వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. మహేష్, నమ్రతలను పూరి జగన్నాథ్ సభాముఖంగా సరదాగా ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్ని అలరించింది. ఈ కార్యక్రమంలో ఇంకా కాజల్ అగర్వాల్, చార్మి, 'దిల్'రాజు, భోగవల్లి ప్రసాద్, నిషా అగర్వాల్, అచ్చిరెడ్డి, సురేష్‌రెడ్డి, జెమినీ కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











