దూకుడు మీదున్న మహేష్ చాలా పెంచేస్తున్నాడు...
హీరోలు వేగంగా సినిమాలు చేయాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలి వారి వేగానికి బ్రేయులు పడిపోవడం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆరన్ ల జోరుకి బ్రేకులు పడిపోవడం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ కి అలాగే బ్రేకులు పడ్డాయి. అయితే కెరీర్ లో దూకుడు తప్పదని ఇటీవలే గ్రహించిన మహేష్ బాబుకి మాత్రం కాలం కలిసొచ్చింది. వరుసగా సినిమాలు అంగీకరించిన నేపథ్యంలో అతనికి 'దూకుడు"తో శుభ శకునం ఎదురయింది.
దూకుడు తర్వాత మహేష్ హీరోగా వస్తోన్న సినిమా..'పోకిరి" తర్వాత రిపీట్ అవుతోన్న కాంబినేషన్ ..ఇవి చాలవూ మహేష్ తాజా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటడానికి..ఇవి చాలవన్నట్టు సినిమాపై హైప్ ఇంకా పెంచేయడానికి మహేష్ రకరకాల ఫీట్స్ చేస్తున్నాడు. వాటిల్లో ఒకటి సింగింగ్. 'ది బిజినెస్ మ్యాన్" సినిమా కోసం మహేష్ సింగర్ గా అవతారమెత్తాడు. సంగీత దర్శకుడు థమన్ పట్టుబట్టి మరీ మహేష్ తో పాట పాడించాడని విశ్వసనీయ సమాచారం.
దాంతో మహేష్ పాడిన పాట ఎలా వుంటుందన్న విషయమై సస్పెన్స్ ఇంకా పెరిగిపోయింది. సంక్రాంతికి వస్తోన్న 'ది బిజినెస్ మ్యాన్" రిజల్ట్ ఎలా వున్నా..సంక్రాంతి సీజన్ లో విడుతవుతోన్న సినిమా కావడంతో తొలి రోజు, తొలివారం రికార్డులు మాత్రం మార్మోగిపోవడం దాదాపు ఖాయమే.


Click it and Unblock the Notifications











