»   » వాడికేం తెలుసు?: చిరు 150వ సినిమాపై పూరి ట్వీట్

వాడికేం తెలుసు?: చిరు 150వ సినిమాపై పూరి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్ దగ్గర డెకరేషన్లు చేసేవాడికి ఏం తెలుసు ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ సినిమా డైరెక్ట్ చేస్తాడని. ప్లీజ్ నన్ను దీవించండి' అంటూ పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాటను బయట పెట్టారు. చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా తాను ఖరారైన నేపథ్యంలో పూరి జగన్నాథ్ తన మనసులోని భావాలను అభిమానులతో ఇలా పంచుకున్నారు.

ఈ విషయాన్ని రామ్ చరణ్ కూడా తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ధృవీకరిచారు. ‘అవును నిజమే. మొత్తానికి డాడీ డిసైడ్ అయ్యారు. మెగాస్టార్ 150వ సినిమాకు దర్శకత్వం వహించబోయేది పూరి జగన్నాథ్. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది' అంటూ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ సినిమా 1940-50 కాలం నాటి బ్యాక్ డ్రాపుతో ఉంటుందిన సమాచారం. ప్రస్తుతానికి దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయం మాత్రమే ఖరారైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా వస్తుందనగానే అభిమానులు కాన్ఫిడెంటుగా ఉన్నారు.

Puri Jagannath tweet about Chiranjeevi 150 film

ఈ చిత్రానికి బివిఎస్ రవి కథ అందిస్తారనే ప్రాచరం జరిగింది. మరో వైపు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ కూడా చిరంజీవి కోసం తయారు చేసారు. చివరకు ఏది ఫైనల్ అవుతుందో త్వరలో తేలనుంది. నిన్న మొన్నటి వరకు చిరంజీవి 150వ సినిమాపై చాలా రకాల ప్రచారం జరిగింది. ఆయన సినిమా వినోదాత్మకంగా ఉంటుందని....ఇందుకోసం పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు కూడా టాక్. అయితే ఇపుడు సినిమా బ్యాక్ డ్రాపు 1940-50 కాలం నాటిది అనే విషయం బయకు రాగానే ఇది ఎలాంటి కాన్సెప్టు అయి ఉంటుంది? స్వాతంత్రోద్యమ కాలం నాటి సంఘటనలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయా? సినిమా పూర్తి సందేశాత్మకంగా, దేశభక్తిని రేకెత్తించే విధంగా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతోంది. చిరంజీవి పుట్టినరోజు నాటికి 150వ సినిమాకు సంబంధించి విషయాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. బండ్ల గణేష్ సహనిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.

English summary
The day has finally come. Telugu movie lovers great longing to see Chiranjeevi once again on screen is going to be a reality in no time. Chiranjeevi's 150th movie is going to be directed by Puri Jagannadh and the movie will be launched on Chiranjeevi's birthday August 22.
Please Wait while comments are loading...