ఎన్టీఆర్ సినిమాపై పూరీ ట్వీట్
బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ కావటంతో అదే ఉషారులో మరో నాలుగు సినిమాలకు శ్రీకారం చుట్టారు పూరీ జగన్నాధ్. ఆ విషయాలను,షెడ్యూలను ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ ట్వీట్ లో...ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఆగస్టులో మొదలవుతుంది. గణేష్ బండ్ల ఈ చిత్రం నిర్మిస్తారు. సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ ఉంటుంది. ఇక రవితేజ సినిమా మార్చిలోనూ,పవన్ కళ్యాణ్ తో చేయబోయే చిత్రం మే నెలలోనూ, మహేష్ తో చేయబోయే చిత్రం ఆ తర్వాత ఉంటుంది అన్నారు.
ఇక ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా చేసిన తర్వాత పూరీ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే పవన్ కళ్యాణ్ తో కెరీర్ ప్రారంభంలో బద్రీ చిత్రం చేసారు. ఇన్నాళ్లకు మరో చిత్రం ఓకే చేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ తో బిజినెస్ మ్యాన్ సీక్వెల్ చేయనున్నారు. అలాగే రవితేజ తో దేముడు చేసిన మనుష్యులు చిత్రం చేస్తున్నారు. ఫన్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రాలకు సంభందించి స్క్రిప్టు వర్కు జరుగుతోంది.


Click it and Unblock the Notifications











