ఫ్యాన్స్‌తో పవన్ కళ్యాణ్ షూటింగ్ డేట్ ఫిక్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో అభిమానులతో కలిసి కొన్ని సీన్లు చిత్రీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా షూటింగుకు సంబంధించిన డేట్, ప్లేస్ ఖరారు చేసారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ మేరకు తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలు పోస్టు చేశారు.
'కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి సంబంధించిన షూటింగులో పాల్గొనబోతన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆహ్వానం. రేపటి (ఆగస్టు 9) నుంచి ఆగస్టు 12 వరకు షూటింగ్ జరుగుతుంది. ఉదయం 9గంట లనుంచి సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది' అని పూరి ట్వీట్ చేశారు.
పవన్, తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సంగీతం : మణిశర్మ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











