'యుగాంతం' పై పూరీ జగన్నాథ్ ఫన్నీ కామెంట్
ఇక ఈ యుగాంతం విషయమై మరో దర్శకుడు శ్రీనువైట్ల ఓ పాపులర్ తెలుగు దిన పత్రికతో మాట్లాడుతూ.. ఈ యుగాంతం గురించి నా చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాను. ఇకముందు కూడా వింటాను. మన తర్వాతి జనరేషన్ కూడా వింటూనే ఉంటుంది. అందుకే వీటి గురించి అస్సలు పట్టించుకోను. అంతేకాదు... నా భార్యాపిల్లల దగ్గర కూడా ఇలాంటి ప్రస్తావన తేనివ్వను. 21 తర్వాత 22వ తారీకు వస్తుంది. సూర్యుడు మామూలుగానే ఉదయిస్తాడు. నా సినిమాలు నేను చేసు కుంటూ ఉంటాను. మీ పని మీరు చూసుకుంటూ ఉంటారు... అంతే అన్నారు.
హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ.. 'యుగాంతం' అనే మాట వినగానే ఎవరెవరు భయపడుతున్నారో తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ప్రపంచం చాలా పెద్దది. ఒకే ఒక్క రోజులో అంతమవుతుందంటే నేను నమ్మను. అందుకే దాని గురించి ఆలోచించడంలేదు. నేనింకా బోలెడన్ని సినిమాలు చెయ్యాలి. మీ అందరూ ఆ సినిమాలను చూడాలి. ఇంకా లైఫ్‌లో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ సాధించకుండానే యుగాంతమా? అది జరగనే జరగదు. యుగాంతం అని జోస్యం చెబుతున్న క్యాలెండర్స్‌ని నేను నమ్మడంలేదు అన్నారు.
హీరో వెంకటేష్ అయితే... చావు అనేది ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. కాకపోతే.. ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే. ఒకవేళ నిజంగా యుగాంతం అయితే ఏమవుతుంది? చనిపోతాం... అంతేకదా! అయినా ఇలాంటివి నేను నమ్మను. నిజంగా 21న యుగాంతం అయితే... ఈ ఇంటర్వ్యూలు, సినిమాలు అంటూ మనం టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనకు ఉన్న టైమ్ రెండు వారాలేగా? మరి మా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సంగతేంటి? ఎన్నో కష్టాలు పడి ఆ సినిమా చేసింది వచ్చే కృతయుగంలో చూడ్డానికా? అన్నారు.


Click it and Unblock the Notifications












