ఇడియట్-2 కాదు...‘టూ ఇడియట్స్’

By Bojja Kumar

రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆ మధ్య వచ్చిన ఇడియట్ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ సినిమా సీక్వెల్ గా ఇడియట్-2 సినిమా తీస్తున్నట్లు గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం....ఆ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాథ్ 'టూ ఇడియట్స్' అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్టుపై కసరత్తు జరుగుతోంది. బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రవితేజ-ఇలియానా ఇందులో రొమాన్స్ చేయనున్నారు. సినిమా టైటిల్ కు తగిన విధంగా రవితేజ, ఇలియానా ఇడియట్ బిహేవియర్ తో సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నారని దర్శకుడు పూరి జగన్నాథ్ వెల్లడించారు. రవితేజ-ఇలియానా కలిసి రొమాన్స్ చేయడం ఇది మూడో సారి. ఇదివరకే ఈ ఇద్దరు ఖతర్నాక్, కిక్ సినిమాల్లో కలిసి నటించారు.

ప్రస్తుతం రవితేజ నిప్పు సినిమా షూటింగులో బిజీగా ఉండగా, పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోన్నారు. అనంతరం టూ ఇడియట్స్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X