బిజినెస్ మేన్‌కు పూరీ జగన్నాథ్ బిసి కార్డు
పోకిరి తర్వాత పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'ది బిజినెస్ మ్యాన్". నాన్ స్టాప్ గా ముంబై, హైదరాబాద్‌లో షూటింగులు జరుపుకొంటోంది. అయితే ఎక్కువ భాగం ముంబైలో షూటింగ్ ప్లాన్ చేశారు. దీంతో సినిమా షూటింగ్ త్వరగా, సజావుగా సాగడానికి బీసీ(Buddah Crew)లను వాడుకుంటున్నాడు పూరి.
ఇది వరకు బాలీవుడ్ లో బుడ్డా సినిమా రూపొందించినప్పుటి నుంచి బాలీవుడ్ టెక్నీషియన్స్ తో పూరికీ మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే వాళ్లని తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడు. త్వరలో మరిన్ని సినిమాలను బాలీవుడ్ లో రూపొందించేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వారిని లైన్లో పెడుతున్నాడు. బ్యాంకాక్ లో తిష్ట వేసిన పూరి...ఇప్పడు ప్రతి చిన్న విషయానికి ముంబై రాకుండా, వారి ద్వారానే తన సినిమాలకు సంబంధించిన పనులకు చక్క దిద్దుకుంటున్నాడు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప స్వయంగా తాను రంగంలోకి దిగడం లేదు. ఇలా బాలీవుడ్ లో తన అనుబంధాన్ని పెంచుకుంటూ అలా అలా ఎదిగి పోతున్నాడు...పూరి.


Click it and Unblock the Notifications











