పూరీ జగన్నాధ్ సెంటిమెంట్ తో ‘సోలో’
దర్శకుడు పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన యువత చిత్రం మంచి విజయం సాధించి దర్శకుడు పరుశరామ్ కి కెరీర్ ప్రారంభమయ్యేలా చేసింది. ఆయన రెండో చిత్రం ఆంజనేయులు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో తన మూడో చిత్రం 'సోలో"కి మళ్లీ పూరీ చేతే వాయిస్ ఓవర్ ఇప్పించి సెంటిమెంట్ ని రిపీట్ చెయ్యాలని చూస్తున్నాడు.
ఈ విషయాన్ని దర్శకుడు పరశరామ్ మీడియాకు తెలియచేస్తూ..నా గురువు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ 'సోలో" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.అలాగే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. మనమే సాధించుకోవాలి. ప్రయాణంలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ అవే వస్తాయి". ఒక్క ముక్కలో చెప్పాలంటే 'సోలో" చిత్రం కథ ఇదే. ఇందులో హీరో అనాధ. ఇరవైఅయిదేళ్ల తన జీవితంలో ఎదురైన తీపి, చేదు అనుభవాల సమాహారమే ఈ సినిమా అన్నారు. నారా రోహిత్, నిషా అగర్వాల్ జంటగా పరశురామ్ బుధవారం దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
ఇక ''నా రెండవ చిత్రం 'అంజనేయులు" ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని, హీరోల గురించి ఆలోచించకుండా ముందు కథను పక్కాగా రెడీ చేసుకున్నాను. ఇది చాలా భిన్నమైన కథ. నిజానికి ఇలాంటి కథల్లో నటించడానికి ఏ హీరో ముందుకు రాడు. కానీ రోహిత్ వచ్చాడు. అంతేకాదు... వందశాతం తన పాత్రకు న్యాయం చేశాడు. 'నా ప్రేమకథకు నేనే విలన్‌ని..." అంటూ ఇందులో రోహిత్ చెప్పే పంచ్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ సినిమాతో తను తప్పకుండా కమర్షియల్ హీరోగా ఎదుగుతాడు.'ప్రకాష్‌రాజ్, నిషా అగర్వాల్ తండ్రీ కూతుళ్లుగా నటించారు. నా జీవితంలో ఎదురైన పలు సంఘటనల ఆధారంగా ఈ కథ రెడీ చేసుకున్నాను. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఓ ఎస్సెట్ అని చెప్పారు.


Click it and Unblock the Notifications











