దాసరి గారి మాటలు నాపై పనిచేసాయి: పూరి జగన్నాథ్

By Srikanya

హైదరాబాద్ : చిన్న సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఈ తరహా చిత్రాల్ని తెరకెక్కించాలనుకొంటున్నా అంటున్నారు పూరి జగన్నాథ్. ఆయన మాట్లాడుతూ.... 'ఎప్పుడూ స్టార్‌ హీరోలతోనే సినిమాలు చేస్తావా? అప్పుడప్పుడూ చిన్నవాళ్లతోనూ తీయాలి. ఎప్పుడైనా పెద్ద హీరోలు సినిమాలు చేయలేకపోతే అది నీకు కష్టం కాకూడదు' అని ఓ సారి దాసరి నారాయణరావుగారు నాతో అన్నారు. ఆ మాటలు నాపై బాగా పని చేశాయి. ఆయన మాటలు అక్షరాలా నిజం. చిన్న సినిమాలే పరిశ్రమను నడిపిస్తాయి. వచ్చే ఏడాది నుంచి నా నిర్మాణ సంస్థ నుంచి చిన్న సినిమాలొస్తాయి. కొత్తవారిని ప్రోత్సహిస్తా'' అన్నారు.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా రూపొందుతున్న రోమియో చిత్రానికి కథ అందించారు. 'రోమియో' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ కథ గురించి మాట్లాడుతూ..''ఓసారి వెరోనా అనే అందమైన ప్రదేశానికి వెళ్లా. రోమియో, జూలియట్‌ అక్కడే కలుసుకొన్నారట. ప్రపంచంలోని ప్రేమికులంతా అక్కడి కొచ్చి తమ ప్రేమ విజయవంతం కావాలని దండం పెట్టుకొంటారు. ఆ స్ఫూరితో రాసిన కథ ఈ 'రోమియో'..'' అంటున్నారు పూరి జగన్నాథ్‌.

Puri Jagannath wants to make Small Budget movies

అలాగే పూరీ జగన్నాథ్ కంటిన్యూ చేస్తూ... ''ఓ అందమైన ప్రేమకథ ఇది. రొమాంటిక్‌ సన్నివేశాలు బాగా వచ్చాయి. సాయి లుక్‌ ఈ సినిమాలో బాగుంది. గోపీ నా దగ్గర సహాయకుడిగా పని చేశాడు. నా తొలి సినిమా కంటే తను బాగా తీశాడు. రవితేజ అతిథి పాత్రలో నటించాడు. పాత్ర చిన్నదే అయినా ఆ ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది. సునీల్‌ కశ్యప్‌ బాణీలు బాగున్నాయి. ఇటీవల మధుర శ్రీధర్‌ ఈ సినిమా చూశారు. ఆయనకు బాగా నచ్చింది. అందుకే విడుదల చేయడానికి ముందుకొచ్చారు.

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నటించిన చిత్రం 'రోమియో'. గోపి గణేష్‌ దర్శకుడు. ఈ చిత్రానికి పూరి కథ అందించారు. ''నేను, సాయిరామ్‌శంకర్‌ కలసి 'ఇడియట్‌'కి పని చేశాం. ఆ తర్వాత సాయి హీరోగా సినిమా చేద్దామని ఆలోచన వచ్చి పూరిగారు అందించిన కథతో తెరకెక్కించాము''అన్నారు దర్శకుడు. అందరికీ నచ్చే చిత్రమవుతుందన్నారు నిర్మాత. అక్టోబరు 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు చిత్ర సమర్పకుడు మధుర శ్రీధర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X