'దూకుడు' పై పూరీ జగన్నాధ్ స్పందన
తన హీరో మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ని, బాక్సాఫీస్ కలెక్షన్స్ కి ఇంప్రెస్ అయిన పూరీ జగన్నాధ్ రీసెంట్ గా ముంబైలో దూకుడుని చూసారు. ఆ చిత్రం నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఆ చిత్రం ప్రింట్ తెప్పించుకుని మరీ అక్కడ చూడటం జరిగింది. ది బిజెనెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పూరీ ఇలా ఖాళీ చేసుకుని చిత్రం చూడటం జరిగింది. ఇక చిత్రం చూసిన పూరీ జగన్నాధ్ చాలా హ్యాపీ ఫీలయ్యారట. ఆయన తాను మనస్పూర్తిగా సినిమాని ఎంజాయ్ చేసానని చెప్పారు. అలాగే మహేష్ ఫెరఫార్మెన్స్ అదిరిపోయిందని కామెంట్ చేసారు. ఇక పూరీ తీస్తున్న ది బిజెనెస్ మ్యాన్ చిత్రానికి ఈ దూకుడు చిత్రం టాక్ బాగా ఉపయోగపడనుంది.
బిజెనెస్ మ్యాన్ బిజినెస్ ఓ రేంజిలో జరగనుందని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక ది బిజెనెస్ మ్యాన్ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్ మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











