పూరీ జగన్నాధ్ కొత్త సినిమా 'కోతులు'

By Staff

Puri Jagannath
ప్రస్తుతం నేనింతే సినిమాను రూపిందిస్తున్న పూరీ జగన్నాధ్ తాజాగా కోతులు అనే టైటిల్ తో ఓ విభిన్న తరహా చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో సందడే సందడి,ఖుషీ ఖుషీగా,స్వాగంతం చిత్రాలు నిర్మించిన ఆదిత్యారామ్ ఈ ప్రాజెక్టుకు నిర్మాత. ఇక పూరీ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఈ సందర్బంగా పూరీ మాట్లాడుతూ అందరూ కొత్త కథలు,కొత్త సినిమాలు కోరుకుంటూంటారు. అలాగే అందరూ తమ చిత్రం విభిన్నమైందని స్టేట్ మెంట్స్ ఇస్తూంటారు.

అయితే ఏ చిత్రం ఎలాంటిదో రిలీజయితేగానీ నిర్ణయించలేము. అయితే ఈ కోతులు మాత్రం చాలా ఢిఫెరెంటు కాన్సెప్ట్ ..అలాగే తర్వాత నేను తీయబోయే నేను లేకపోతే కూడా అలాంటి జెనరే అని ధీమాగా చెప్తున్నారు. అయితే ఈ సినిమాలయినా ఆయన చెప్పినట్లు రిలీజయ్యాక గానీ విభిన్న తరహాకి సంభందించినవో కాదో తెలియదు. ప్రస్తుతం పూరీ నేనింతే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందులో రవితేజ అసెస్టెంట్ డైరక్టర్ గానూ, హీరోయిన్ గా పరిచయమవుతున్న సియా గ్రూప్ డాన్స ర్ గానూ కనిపించనున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక కోతులు ప్రారంభమవుతుందని, ప్రస్తుతం దానికి సంభందించిన స్క్రిప్టు వర్కు జరుగుతుందని ఆయన చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X