లిరిక్ రైటర్ కి పూరీ జగన్నాథ్ కాస్ట్ లీ గిఫ్ట్

ప్లాటినమ్ డిస్క్ వేడుకలో పూరి మాట్లాడుతూ ''నా సినిమాలకి ఇంకా మంచి మంచి పాటలు రాయాలని భాస్కరభట్లకి పెన్ను కొనిచ్చా'' అన్నారు. ''పూరిగారితో పనిచేయడం చాలా బాగుంటుంది. 'హార్ట్‌ఎటాక్' రూపంలో మరోసారి ఆయనకి సింగిల్‌కార్డ్ గీతాలు రాశాను. ఆయన్నుంచి ఖరీదైన పెన్నును అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది'' అన్నారు భాస్కరభట్ల.
''ఇది వరకు నేను నటించిన సినిమాలు ఏ, బి కేంద్రాల్లో మాత్రమే ఆడాయి. 'హార్ట్ ఎటాక్'కి సి కేంద్రాల్లో కూడా చక్కటి ఆదరణ దక్కింది. పూరి జగన్నాథ్ నాకు మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టారు. ఆయనతో త్వరలోనే మరో సినిమా చేయబోతున్నా'' అన్నారు నితిన్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'హార్ట్ ఎటాక్'. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమం జరిగింది. పూరి జగన్నాథ్ చిత్ర బృందానికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.
''దర్శక నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. అనూప్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం చక్కగా కుదిరాయి'' అన్నారు పూరి జగన్నాథ్. అనూప్‌రూబెన్స్ మాట్లాడుతూ ''పూరిగారితో పూర్తిస్థాయిలో సినిమా చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. తక్కువ సమయంలోనే నాణ్యమైన బాణీల్ని పూరి రాబట్టుకొన్నారు'' అన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, భాస్కరభట్ల, రామ్‌లక్ష్మణ్, విక్రమ్‌జీత్, శేఖర్, బ్రహ్మకడలి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications