పూరీ 'ది బిజినెస్ మ్యాన్' లేటెస్ట్ ఇన్ఫో
మహేష్ తో పూరీ జగన్నాధ్ ది బిజినెస్ మ్యాన్ చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం లొకేషన్స్ ఎంపికలో బిజిగా ఉంది.పూరి జగన్ తన అసెస్టెంట్స్ తో కలసి లొకేషన్స్ ని వెతుకుతున్నారు.ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.ఈ విషయమై పూరీ మాట్లాడుతూ...తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ ఒకేలా ఎందుకుంటాయి. ఒకటి ప్రత్యేకంగా మహేష్ కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడేలా డిజైన్ చేసింది. మరొకటి అభిషేక్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చేలా చేసిన స్క్రిప్టు. అలాగే నేను తెలుగు వెర్షన్ కి రీమేక్ లాగ దీన్ని తీర్చిదిద్దదలుచుకోలేదు. అయితే రెండు చిత్రాలకు నేపధ్యం మాత్రం ముంబై మాత్రమే. అక్కడే కథ జరుగుతుంది. కథలో మార్పులు మాత్రం ఉంటాయి. అలాగే హీరోయిన్ గా కాజల్ ని కూడా తెలుగుకే పరిమితం చేసి హిందీకి వేరే ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను. మహేష్ బాబు తో తెలుగు వెర్షన్ ని వచ్చే నెలలో ప్రారంభిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











