»   » పూరీ డైరెక్షన్ లో ‘గబ్బర్ సింగ్’గా రవితేజ..

పూరీ డైరెక్షన్ లో ‘గబ్బర్ సింగ్’గా రవితేజ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గబ్బర్ సింగ్" కోసం తెగ వెతుకులాట ప్రారంభించాడట పూరీ. ఇదేదో పవన్ కళ్యాణ్ సినిమా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడనుకునేరు. అదేంకాదు ఆ మధ్య గురుడు వర్మ అలనాటి సూపర్ హిట్ 'షోలే"ని చిత్రవథ చేసి, జనం మీదకి వదిలేసి బాక్సీఫీస్ ముందు బొక్కబోర్లా పడితే తాను మాత్రం ఇదే చిత్రాన్ని తెలుగుదనంతో మల్టీస్టారర్ గా తీస్తానంటూ సిద్దమైపోతున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా ప్రభాస్, గోపిచంద్ లని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నా, 'షోలే"లో గబ్బర్ సింగ్ పాత్రకి ప్రత్యేక ప్రాధాన్యతని అంజద్ ఖాన్ తన వాగ్పటిమతో, నటనా చతురతో చేకూరిస్తే..దాన్ని అమితాబ్ అనుకరించినా పండించలేక పోయాడు. ఇప్పుడు ఈ తెలుగు 'గబ్బర్ సింగ్"కి పూర్తి స్థాయి కామెడీని జోడించేలా చూస్తూనే, రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట పూరీ. అసలే అమితాబ్ చేసిన పాత్ర కావటంతో ఈ వీరాభిమాని ఒప్పేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu