పూరీ జగన్నాధ్ 'నేను.. నా రాక్షసి' లేటెస్ట్ ఇన్ఫో ...
దగ్గుపాటి రాణా, ఇలియానా జంటగా నటిస్తోన్న చిత్రం 'నేను..నా రాక్షసి'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. అభిమన్యు సింగ్, ఇలియానా, రాణాపై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వేనిస్, బ్యాంకాక్ లలో పాటల చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'95 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయింది. మిగతాది హైదరాబాద్ లో పూర్తచేయనున్నాం. జగన్ తో పనిచేయడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు. సంక్రాంతి కానుకగా తీసుకురావటానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్ రాథోడ్.


Click it and Unblock the Notifications











