నితిన్‌తో పూరి ‘ఇడియట్-2’ కాన్సెప్టా?
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్ లో ఉన్న నితిన్ ఫస్ట్ టైమ్ పూరి జగన్నాథ్‌తో కలిసి చేస్తున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.....ఈచిత్రానికి 'హార్ట్ ఎటాక్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 'ఇడియట్'కు సీక్వెల్ గా 'ఇడియట్-2' తీయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పూరి జగన్నాథ్.....ఇప్పుడు నితిన్‌తో తీయబోయే సినిమాలో 'ఇడియట్-2' కాన్సెప్టును జొప్పించాలనే ఆలోచనలో ఉన్నాడట.
పూరితో పని చేసే అవకాశం రావడంపై నితిన్ స్పందిస్తూ...'పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరుతోంది. పూరి గారు చెప్పిన సబ్జెక్టు వినగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ చేద్దామా అని ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది' అని తెలిపారు.
ఆగస్టు 15 నుంచి నాన్ స్టాప్‌గా యూరఫ్, గోవాలలో జరిగే భారీ షెడ్యూల్స్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. నితిన్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయి నితిన్ ని చాలా పెద్ద రేంజికి తీసుకెళ్లే సినిమాగా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని చాలా పెద్ద లెవల్‌లో తీస్తున్నారు. నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈచిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం : పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications












