కొత్త స్క్రిప్టు రైటర్స్ కు పూరి జగన్నాథ్ బంపర్ ఆఫర్

By Srikanya

హైదరాబాద్: కొత్త నీరు పరిశ్రమలోకి మరింతగా రావటానికి దర్శక,నిర్మాత,రచయిత పూరీ జగన్నాథ్ పూనుకున్నారు. ఆయన కొత్త స్క్రిప్టు రైటర్స్ కు గోల్డన్ ఆఫర్ ఇస్తున్నారు. కథ ని ఇంట్రస్ట్రింగ్ గా చెప్పటానికి పేరు బడ్డ ఆయన తనలాంటి మరికొంతమంది రచయితలను ఆహ్వానిస్తున్నారు. అందుకు ముందుగా సినాప్సిస్ రాసి తనకి పంపమంటున్నారు.

పూరీ ట్వీట్ చేస్తూ.... "ఒక పేజీ సినాప్సిస్ నా మెయిల్ ఐడీ [email protected] కి పంపండి. మీరు నన్ను ఎక్సైట్ చేస్తే, ఖచ్చితంగా నా నుంచి కాల్ వస్తుంది !!" అన్నారు. బెస్టాఫ్ లక్ ..ఆసక్తి ఉన్నవారు వెంటనే మెయిల్ చేసి ఆఫర్ సంపాదించండి..బెస్టాఫ్ లక్.

Puri offered a bumper offer to scriptwriters


ఇక పూరీ తాజా చిత్రం విషయానికి వస్తే...

స్పీడుగా సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట.. పూరి జగన్నాథ్‌. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్‌ హీరో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈలోగా రానా కోసం మరో కథ సిద్ధం చేస్తున్నారు. రానా, పూరిల కలయికలో 'నేను నా రాక్షసి' వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కలయిక పట్టాలెక్కబోతోందని సమాచారం.

తెలుగు, హిందీ భాషల్లో పూరి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, అందులో రానా హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. రానాకి హిందీలో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు పూరి 'బుడ్డా బన్‌ గయా తేరా బాప్‌' చిత్రంతో బాలీవుడ్‌లో విజయం సాధించారు. అందుకే ఈ కలయికకు రంగం సిద్ధమైందన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X