విచిత్రాలు చేస్తున్న పూరి చిలుక...! (ఫోటో)
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి తనకు నచ్చిన విధంగా లగ్జరీగా ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తమకు ఇష్టమైన పక్షులు, పెట్స్ కూడా పెంచుకుంటున్నారు. పూరికి ఇష్టమైన తెలుపు రంగు చిలుక అతనితో ఎంతో క్లోజ్ గా ఉంటుంది. పూరితో కలిసి కాఫీ తాగడంతో పాటు, దోష కూడా తింటుందట.
పూరికే కాదు...ఆయన భార్య లావణ్య కూడా ఓ చిలకను అపురూపంగా పెంచుకుంటోంది. దాని పేరు ట్వీటి. బంగారు వర్ణంతో ఉన్న ముద్దుల చిలుక అంటే పూరి భార్య లావణ్యకు ఎంతో ఇష్టం. పరిస్థితి చూస్తుంటే ఇంటిల్లి పాదీ పక్షులు, పెట్స్‌తో ఎక్కువ స్నేహం చేస్తున్నట్లున్నారు.
చిలకల సంగతి పక్కన పెడితే...పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు 'టెంపర్‘. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరిగింది. ఈ చిత్రంలో ఐటం సాంగ్ ప్రత్యేకంగా ఉండనుంది. మొరాకోకు చెందిన మోడల్ నోరా ఫతేహి తో ఐటెం సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు పూరి.

ఈ ఐటం సాంగ్‌లో అమ్మడు దుమ్మురేపడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. టెంపర్ చిత్రానికి ఈ పాటే హైలెట్ అవుతుందని టాక్. సాంగ్‌కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి తీసారు. ఎంత తొందరగా షూటింగ్ ముగిస్తే అంత తొందరగా సినిమాను విడుదల చేయవచ్చని పూరి అనుకుంటున్నారు. బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో సాగుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆడియోని ఈనెల 18న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











