ఇడియట్ ప్రభావంతో... ‘దేవుడు చేసిన మనుషులు’
మాస్ మహరాజా రవితేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై భారీ చిత్రాల నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. ఈ నెల 22న ఆడియో విడుదల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ హాట్లాడుతూ....'ఇడియట్ చూసినప్పటి నుంచి రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ సినిమా చెయ్యాలన్న కోరిక నాలో కలిగింది. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్, బ్యాంకాక్, స్విట్జర్లాండ్ లలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోను ఈనెల 22న శిల్పకళా వేదికలో విడుదల చేస్తున్నాం. రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్‌ని జూలై ద్వితీయార్థంలో భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
రవితేజ సరసన గ్లామర్ స్టార్ ఇలియానా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా, మానస, గ్రాబియల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్కర భట్ల, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంటోనీ, దినేష్, స్టిల్స్: సాయి మాగంటి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ రాజు. ఆర్, క్యాషియర్: జంగపల్లి మొగిలి, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కో-ప్రొడ్యూసర్స్: భోగపల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











