twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "మెహబూబా" పునర్జన్మల ఫార్ములానా? పూరీ..! వర్క్ ఔట్ అయ్యేనా ఇదీ !?

    పూరీ, ఇప్పుడు మాఫియాని వదిలి పెట్టి పునర్జన్మల కథ తీస్తున్నాడట. అవును తన కొడుకు ఆకాశ్ తో తీస్తున్న మెహబూబా పునర్జన్మల ప్రేమ కథ అంటూ ఒక మాట వినిపిస్తోంది....

    |

    Recommended Video

    Puri Jagannadh's "Mehbooba" Movie Is A Re-Birth Concept Of Love Story

    పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఎవ్వరికైనా మూడు విషయాలే గుర్తొస్తాయ్, హీరో కి విపరీతమైన బలుపు ఉంటుంది, హీరోయిన్ కి బట్టలంటే చిరాకు ఉంటుంది, వీళ్ళిద్దరినీ ఒక మాఫియా గ్యాంగ్ కత్తులూ, గన్స్ తో వెంటాడుతూ ఉంటుంది... ఇలా ఒక రకమైన మూసలోకి పడిపోయాడు పూరీ. ఒకప్పుడు పూరీ మేకింగ్ అన్నా, పూరీ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ అన్నా ఒక ఎక్సైట్మెంట్ ఉండేది కానీ ఇప్పుడు పూరీ సినిమా అంటే సర్లే చూద్దాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. అయితే పూరీలో ఉండే ఒక ఎనర్జీ అతన్ని ఊరికే కూర్చోనివ్వదు. ప్రపంచం తో సంబందం లేనట్టు తన పనిలో తానుంటాడు. అయితే ఈ తరహా పద్దతిని మార్చుకోవాలనుకుంటున్నాడేమో పూరీ, ఇప్పుడు మాఫియాని వదిలి పెట్టి పునర్జన్మల కథ తీస్తున్నాడట. అవును తన కొడుకు ఆకాశ్ తో తీస్తున్న మెహబూబా పునర్జన్మల ప్రేమ కథ అంటూ ఒక మాట వినిపిస్తోంది....

    ఆసక్తికరమైన కథ

    ఆసక్తికరమైన కథ

    ఈ కథలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ రెండు జన్మలుంటాయని, గతంలో చనిపోయిన ఇద్దరూ మళ్ళీ ప్రస్తుతంలో పుట్టడం వంటి ఆసక్తికరమైన పాయింట్ ఈ కథలో ఉందని సమాచారం. మరి పూరి ఈ ఆసక్తికరమైన కథను తన టేకింగ్ తో ఇంకెంత ఆసక్తికరంగా తెరకెక్కిస్తారో చూడాలి. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి జగన్ టూరింగ్ టాకీస్ పై నిర్మితంకానున్న ఈ చిత్రంలో ఆకాష్ పూరికి జంటగా కొత్త హీరోయిన్ నేహా శెట్టి నటిస్తోంది.

     చనిపోయిన జంట మళ్లీ పుడితే

    చనిపోయిన జంట మళ్లీ పుడితే

    ఇండియా, పాకిస్తాన్‌ విడిపోయినపుడు చనిపోయిన జంట మళ్లీ ఇపుడు పుడితే వారికి ఎదురయ్యే పరిస్థితులేంటి అనే నేపథ్యంలో ఈ చిత్రం వుంటుందట. యాక్షన్‌ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుందని, డైలాగ్స్‌ చాలా బాగా రాసాడని చెబుతున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన మూగమనసులు, తర్వాత వచ్చిన జానకి రాముడు, మధ్యలో వచ్చిన ప్రాణం, తర్వాత వచ్చిన మగధీర ఇలా మన టాలీవుడ్ లో ఈ రెండో జన్మ ప్రేమజంటలకి తక్కువేం లేదు.

    పునర్జన్మల నేపథ్యం

    పునర్జన్మల నేపథ్యం

    అయితే పూరీ తల్చుకుంటే ఆ సినిమాలని మర్చిపోయి మరీ చూసే స్థాయిలో మెస్మరజ్ చేయగలడు అని పూరి అభిమానులు నమ్ముతూంటారు కాబట్టి. ఈ సినిమా ఎలా ఉండబోతూందో ఊహించుకుంటూ ఎదురు చూడాల్సిందే., మనం వరకు పునర్జన్మల నేపథ్యం తెలుగు సినిమాకి సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా. ఈ నేపథ్యంలో తీసిన సినిమాల్లో ఫెయిలయినవి చాలా తక్కువ. అందుకే పూరి తన కొడుకు కోసం ఈ ఫార్ములాని నమ్ముకున్నట్టున్నాడు.

    1971 ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో

    1971 ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో

    1971 ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో నడిచే భావపూర్ణమైన ప్రేమకథలో హీరో, హీరోయిన్ కాకుండా మిగతా పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయం ఇంతవరకూ డైరెక్టర్ ఎక్కడా బయటపెట్టలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించేదెవరో తెలిసిపోయింది. బాలయ్య డిక్టేటర్ మూవీలో నటించిన.. ఢిల్లీకి చెందిన గౌతమ్ కురూప్ ‘మెహబూబా'లో నటిస్తున్నాడు.

    చాలా కీలకం

    చాలా కీలకం

    ఈ చిత్రం తనయుడు ఆకాష్‌కే కాక తనకి కూడా చాలా కీలకం కావడంతో పూరి ఈసారి మరీ తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలతోనే ఈ చిత్రం తీర్చిదిద్దుతాడని భావిస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత పూరి ఈ చిత్రాన్ని సొంతంగానే నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా అయినా అటు ఆకాస్ కీ ఇటు పూరీకీ ఒక బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

    English summary
    Filmmaker Puri Jagannadh upcoming film Mehbooba With his son Akash, as per new Repoart That Story based on a Magadheera Consept Re birth, Love story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X